మదర్సాల్లో హనుమాన్ చాలీసా తప్పనిసరి చేయాలి : బీజేపీ నేత

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 07:47 AM IST
మదర్సాల్లో హనుమాన్ చాలీసా తప్పనిసరి చేయాలి : బీజేపీ నేత

ఢిల్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌కు BJP జనరల్‌ సెక్రటరీ కైలాష్‌ విజయ్‌వర్గీయ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్బంగా ఆయన..ఢిల్లీ విద్యాసంస్థల్లోను అంటే స్కూల్స్, మదర్సాల్లో కూడా విద్యార్దులతో హనుమాన్‌ చాలీసా చదివించాలని..దీన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. 

మీరు హనుమంతుడి ఆశీస్సులతో ఢిల్లీలో గెలుపొందారు. కాబట్టి ఢిల్లీలోని అన్ని విద్యాసంస్థల్లో హనుమాన్‌ చాలీసా చదివేలా చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్‌ను కోరారు. హనుమాన్‌ చాలీసాను స్కూల్స్ లోనే కాకుండా..మదర్సాల్లో కూడా అమలు చేయాలని సూచించారు.  

భజరంగ్‌భళీ హనుమాన్  ఆశీస్సులు ఢిల్లీ విద్యార్థులకు ఎందుకు ఉండకూడదు అంటూ ప్రశ్నిచారు. హనుమంతుడు.. ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయాన్ని  సాధించానని ఎన్నికల ఫలితాల అనంతరం కేజ్రీవాల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బీజేపీ నేత కైలాష్‌ విజయ్‌వర్గీయ అన్నారు. 

కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్‌ 62 స్థానాల్లో ఘన విజయం సాధించింది. బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. విజయం సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ త్వరలోనే మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి  బాధ్యతలు చేపట్టానున్నారు. కాగా..హిందూవాడిగా ఉండటానికి బీజేపీ ఆమోదం అవసరం లేదని కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘హనుమాన్ చలీసా’ పారాయణం చేశారు.