Uttarakhand: హిందూ సంఘాల ఒత్తిడితో ముస్లిం వ్యక్తితో కూతురి పెళ్లి ఆపేసిన బీజేపీ నేత

యష్పాల్ కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ నెల 28న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతలో పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలోకి వచ్చింది

Uttarakhand: హిందూ సంఘాల ఒత్తిడితో ముస్లిం వ్యక్తితో కూతురి పెళ్లి ఆపేసిన బీజేపీ నేత

Marriage with Muslim: ముస్లిం యువకుడితో పెళ్లి ఫిక్సైంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక పెళ్లి జరగడమే తరువాయి. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత కారణంగా తన కూతురి వివాహం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇది ఏ సాధారణ వ్యక్తులతో ఎదురైన సంఘటన కాదు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక నేతకు ఎదురైన అనుభవం. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన యష్పాల్ బేనమ్ అనే వ్యక్తి బీజేపీ నేత. అంతే కాదు, పౌరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా.

DK Shivakumar: 135 సీట్లు గెలిచాం.. అయినా నేను హ్యాపీగా లేను.. ఎందుకంటే?: డీకే శివకుమార్

కాగా, యష్పాల్ కూతురు ఒక ముస్లిం యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లను ఒప్పించి ఈ నెల 28న పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇంతలో పెళ్లికి సంబంధించిన కార్డు సోషల్ మీడియాలోకి వచ్చింది. అంతే హిందూ సంఘాలు, రైట్ వింగ్ గ్రూపులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. లవ్ జిహాద్ అంటూ ట్రోల్స్ వేశారు. మెసేజ్లు, ఫోన్ కాల్స్ రూపంలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక కూతురు పెళ్లిని వాయిదా వేసుకున్నారు యష్పాల్.

Rahul Gandhi: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ అభ్యంతరం.. ఓవైసీ కూడా

తన కూతురు సంతోషం కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నానని, నిజానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటారని యష్పాల్ అన్నారు. కానీ సోషల్ మీడియా ధాటికి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, ఇప్పుడు తాను ప్రజల అభిప్రాయాల్ని వినాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.