Rajesh Mishra: ‘ఎమ్మెల్యే to లా’.. 12 తరగతి పరీక్ష హాలులోకి హాల్ టికెట్, ప్యాడ్‭తో బీజేపీ నేత

మిశ్రా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరేలీలోని బిత్రి చైన్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ నుంచి టికెట్ రాలేదు. దీంతో ఆయన పోటీ చేయలేదు. రాజకీయాలు చురుగ్గా సాగిస్తూనే చదువు కొనసాగిస్తానని మిశ్రా విశ్వాసం వ్యక్తం చేశారు

Rajesh Mishra: ‘ఎమ్మెల్యే to లా’.. 12 తరగతి పరీక్ష హాలులోకి హాల్ టికెట్, ప్యాడ్‭తో బీజేపీ నేత

BJP leader rajesh mishra with hall ticket and pad to class 12 exam hall

Rajesh Mishra: ఫిబ్రవరి 16న 12వ తరగతి పరీక్ష జరుగుతోంది. పరీక్ష హాలులోకి ఒక పెద్దాయన ఒకరు చేతిలో హాల్ టికెట్, ఎగ్జాట్ ప్యాడ్‭, మరొక చేతిలో వాటర్ బాటిల్‭తో వచ్చారు. ఆయన మరెవరో కాదు, ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేత రాజేశ్ మిశ్రా(51) అలియాస్ పప్పు భర్తాల్. విద్యార్థులంతా ఆయనను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలాంటివి దేశంలో సర్వసాధారణమే అయినప్పటికీ, ఈ పరీక్షకు హాజరవ్వడం వెనుక ఉన్న కారణమైతే తప్పనిసరిగా ఆసక్తిని కల్పించకమానదు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రజా ప్రతినిధిగా చాలినంతగా న్యాయం చేయలేకపోయానని, ఇప్పుడు లా చదివి వారికి ఎక్కువ న్యాయం చేస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం.

Nagaland Polls: నాగాలాండ్ బరిలో నలుగురే మహిళలు.. ఒక్కరు గెలిచినా చారిత్రక రికార్డే

ఈ విషయమై మిశ్రా మాట్లాడుతూ ‘‘పరీక్షకు వచ్చిన విద్యార్థులు మొదట నన్ను చూసి ఆశ్చర్యపోయారు. కానీ తమ ప్రాంతానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు తమతో పాటు పరీక్షలో హాజరవుతున్నందుకు సంతోషంగా భావించారు’’ అని అన్నారు. రాజకీయంగా బిజీ బిజీగా ఉండే ఆయన, ఇలా పరీక్షలకు సమయాన్ని కేటాయించారు. తన చదువును కొనసాగించాలని అనుకున్న ఆయన.. ఈ పరీక్షల వల్ల తన కంటే చిన్న వయసు వారితో మెరుగ్గా కనెక్ట్ అయ్యే అవకాశం అభిస్తుందని భావించారట. ఇది తనకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందని మిశ్రా అన్నారు.

Rahul Gandhi on Savarkar: సావర్కర్ భావజాలంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

“ప్రజలు ఎక్కువ మంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు. మంచి న్యాయవాదిని పొందలేని కారణంగా వారికి సరైన న్యాయం జరగడం లేదని నేను గ్రహించాను. అలాంటి వారికి సహాయం చేయడానికి నేను న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నాను. అలా చేయాలంటే 12వ తరగతి బోర్డులను క్లియర్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. హిందీ, ఫైన్ ఆర్ట్స్, సోషల్ స్టడీస్, సివిక్స్, సోషియాలజీని సబ్జెక్ట్‌లుగా ఎంచుకున్నాను. ఈ సబ్జెక్టులు నాకు న్యాయశాస్త్రంలో కూడా సహాయపడతాయి’’ అని మిశ్రా అన్నారు. ఈ పరీక్షల కోసం ఆయన రాత్రి 11 గంటల నుంచి మధ్యరాత్రి 1 గంటల వరకు చదువుతున్నారట. పగలు కూడా వీలు దొరికినప్పుడల్లా పుస్తకం పడుతున్నారట.

Meghalaya Assembly Polls: పోలింగుకు సిద్ధమైన మేఘాలయ.. పోటీలో 369 మంది అభ్యర్థులు

మిశ్రా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరేలీలోని బిత్రి చైన్‌పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ నుంచి టికెట్ రాలేదు. దీంతో ఆయన పోటీ చేయలేదు. రాజకీయాలు చురుగ్గా సాగిస్తూనే చదువు కొనసాగిస్తానని మిశ్రా విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక చదువు గురించి మిశ్రా మాట్లాడుతూ “నేను దేని గురించి ఆలోచించకుండా చదువుపై దృష్టి సారిస్తాను. నేటి విద్యార్థులకు కూడా అదే చెబుతున్నాను. ఏకాగ్రతతో పని చేయడం జీవితంలో విజయానికి ఏకైక మంత్రం’’ అని అన్నారు. ఇక తన కుటుంబీకులు కూడా ఆయనకు సహాయపడుతున్నారట. ఆయన పిల్లలు కూడా పరీక్ష ఒత్తిడి నుంచి బయటపడే ఉపాయాలు చెబుతున్నారని మిశ్రా సంతోషం వ్యక్తం చేశారు.