మసీదులో హనుమాన్ చాలీసా పఠనం

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 08:31 AM IST
మసీదులో హనుమాన్ చాలీసా పఠనం

BJP leader recites Hanuman Chalisa in mosque ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురకు 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న గోవర్దన్-బార్‌సానా రోడ్డులోని మసీదులో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నలుగురిలో ఒకరిని యూత్ వింగ్‌‌కు చెందిన వాడిగా అనుమానిస్తున్నారు. 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉన్న నలుగురు యువకులు గోవర్దన్-బర్సానా రోడ్‌‌లోని ఈద్గాలో ప్రవేశించారు. వీరిని సౌరభ్ నంబర్దార్, రాఘవ్ మిట్టల్, రౌకీ, కన్హాలుగా గుర్తించారు



మరోవైపు, భాగపట్ లోని ఓ మసీదులో బీజేపీ నేత మనుపాల్ బాన్సాల్ కూడా మహనుమాన్ చాలీసా పఠనం చేశారు.మసీదులో హనుమాన్ చాలీసా పఠించిన వీడియోను బీజేపీ నేత మనుపాల్ బాన్సాల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో స్థానిక పోలీసులు ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ అభిషేక్ సింగ్… బాన్సాల్ తరుచూ మసీదుకు వెళతడాని, మాసీదు పెద్ద మాల్వీ అలీ హస్సన్ అనుమతితోనే ప్రార్థనలు చేసినట్టు చెప్పారు. కాబట్టి బాన్సాల్ పై ఎటువంటి కేసు నమోదు చేయలేదన్నారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అలీ హస్సన్‌ కూడా ఇదే విషయాన్నిస్పష్టం చేశారు. హిందువుల ప్రార్థనలు చేసేందుకు తానే బాన్సాల్‌ను అనుమతించినట్టు తెలిపారు. అలా చేయడంలో తప్పేమీ లేదన్నారు. సోదరభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.



ఇదే విషయంపై బాన్సాల్ మాట్లాడుతూ.. హస్సన్ అనుమతితోనే మసీదులో హిందూ ప్రార్థనలు చేసినట్టు చెప్పాడు. హనుమాన్ చాలీసాతో పాటు గాయత్రి మంత్రం పఠించినట్టు తెలిపాడు. కాగా, ఇటీవల మథురలోని ఓ దేవాయలం పరిసరాల్లో ఇద్దరు ముస్లిం వ్యక్తులు నమాజ్ చేసిన ఘటన మరువకముందే ఇప్పుడు మసీదులో హనుమాన్ చాలీసా పఠనం చేయడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరైనా మతపరమైన ఉద్రిక్తతలు, గందరగోళాన్ని సృష్టించడానికి యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.