Chess Olympiad 2022 : తమిళనాడులో ‘పొలిటికల్ చెస్ వార్’..చెస్‌ ఈవెంట్‌ హోర్డులపై మోడీ ఫోటోలు

బీజేపీలో వ్యూహాలు మరోవైపు డీఎంకే ప్రతివ్యూహాలు..ఓ వైపు పీఎం మోడీ దళం ఎత్తులు..ఇంకోవైపు సీఎం స్టాలిన్ సైన్యం పై ఎత్తులు ఇలా తమిళనాడులో ‘పొలిటికల్ చెల్ వార్’ అంతకంతకు ముదురుతోంది. చదరంగం కాదు రణరంగం అన్నట్లుగా మారిపోయింది తమిళనాడులో.

Chess Olympiad 2022 : తమిళనాడులో ‘పొలిటికల్ చెస్ వార్’..చెస్‌ ఈవెంట్‌ హోర్డులపై మోడీ ఫోటోలు

Bjp Leader Sticks Pms Photo On Billboards Of Tamil Nadu

Chess Olympiad 2022 In tamilnadu : బీజేపీలో వ్యూహాలు మరోవైపు డీఎంకే ప్రతివ్యూహాలు..ఓ వైపు పీఎం మోడీ దళం ఎత్తులు..ఇంకోవైపు సీఎం స్టాలిన్ సైన్యం పై ఎత్తులు ఇలా తమిళనాడులో ‘పొలిటికల్ చెల్ వార్’ అంతకంతకు ముదురుతోంది. చదరంగం కాదు రణరంగం అన్నట్లుగా మారిపోయింది తమిళనాడులో. చెస్ ఒలింపియార్డ్ లో సత్తా చాటేందుకు భారత్ ఆటగాళ్లు సిద్ధమవుతోంటే..మరోవైపు కాషాయదళం తమ జిత్తుల ప్రదర్శిస్తున్నారు. చెస్ ఒలింపయాడ్ సాక్షిగా బీజేపీ, డీఎంకే పోస్టర్ రాజకీయాలు ముదిరిపాకానపడుతున్నాయి. చెస్ ఒలింపియాడ్ పోస్టర్లలో ప్రధాని మోడీ ఫోటోలు లేకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అక్కడితో ఊరుకోకుండా మోడీ పోస్టర్లను అంటిస్తున్నారు తమిళనాడు బీజేపీ నేతలు.

తమిళనాడులో 44వ చెస్‌ ఒలింపియాడ్‌ జులై 28న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. దీని కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున్న బిల్‌బోర్డు హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. ఐతే ఈ హోర్డింగ్‌ల్లో మోడీ ఫోటో లేకపోవటంతో తమిళనాడు బీజీపీ కార్యకర్త అమర్ ప్రసాద్ రెడ్డి స్టాలిన్‌ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడమే కాకుండా ఇది అతిపెద్ద తప్పుగా భావించి రాద్దాంత చేశారు.మరో ఇద్దరి సన్నిహితులతో కలిసి మోదీ పోటోలను ఆయా హోర్డింగ్‌ బోర్డుల పై అతికించడమే కాకుండా ఆ ఘటన తాలుకా వీడియోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

పైగా ఈ కార్యక్రమం ప్రభుత్వం స్పాన్సర్‌ చేసే అంతర్జాతీయ కార్యక్రమం కాబట్టి మోదీ ఫోటో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. తమిళనాడు అంతటా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌ బోర్డులపై తనలా మోడీ ఫోటోలను పెట్టాలని పార్టీ కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఐతే హోర్డింగ్‌లపై ప్రధాని మోడీ చిత్రపటాలను పెట్టడానికి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా అని అడిగితే… మోడీ ఫోటోను ప్రచారంలో భాగం చేయాలా వద్దా? అంటూ ఎదురు ప్రశ్నించారు.

వాస్తవానికి తాను ఎలాంటి అనుమతి తీసుకోలేదని, బుధవారం నుంచి హోర్డింగ్‌లపై మోడీ ఫోటోలను పెట్టడం చేస్తున్నాని చెప్పుకొచ్చారు. తమిళనాడులో పెద్ద ఎత్తున​ ప్రారంభమవుతున్న ఈ చెస్‌ ఒలింపియాడ్‌ ఆగస్టు 10న ముగియనుంది. ఈ ఈవెంట్‌ కోసం తమిళనాడు ప్రభుత్వం దాదాపు 92 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈక్రమంలో మోడీ ఫోటోలతో నానా యాగీ చేస్తున్నారు తమిళనాడు బీజేపీ నేతలు.

ఈక్రమంలో మోడీ ఫోటోలతో నానా యాగీ చేస్తున్నారు తమిళనాడు బీజేపీ నేతలు.దీనిపై డీఎంకే నేతలు కూడా ఏమాత్రం తగ్గేది లేదంటూ మోడీ ఫోటోలపై నలుపు రంగు పూస్తు నిరసన వ్యక్తంచేశారు. ఇటీవల బీజేపీ డీఎంకే కార్యక్తలు సందు దొరికితే చాలు ఎడా పెడా విమర్శలు చేసుకుంటున్న నేతలు చెస్ ఒలింపియాడ్ ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోలేదు. చెస్ ఒలింపియాడ్ వేళ చెన్నై మొత్తం చదరంగం బోర్డులు.. హోర్డింగ్ లతో నిండిపోయింది. ఈక్రమంలో పోటా పోటీగా బీజేపీ, డీఎంకే కార్యకర్తలు ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తున్నారు.