Uma Bharti : మద్యం షాపుపై దండెత్తిన ఉమా భారతి..రాళ్లతో దాడి చేసి సొంత ప్రభుత్వానికే ధమ్కీ

బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. భోపాల్ లోని ఓ మద్యం షాపుపై రాళ్లతో దాడికి చేసిన ఉమాభారతి సొంత ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు.

Uma Bharti : మద్యం షాపుపై దండెత్తిన ఉమా భారతి..రాళ్లతో దాడి చేసి సొంత ప్రభుత్వానికే ధమ్కీ

Bjp Leader Uma Bharti Vandalises Liquor Shop In Bhopal

 

BJP Leader Uma Bharti : మధ్యప్రదేశ్ మాజీ సీఎం, బీజేపీ మాజీ సీఎం, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె ఏమాట్లాడినా..ఏం చేసినా సంచలనమే.అటువంటి ఉమాభారతి సొంత (బీజేపీ ప్రభుత్వం) ప్రభుత్వనికే వార్నింగ్ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. మద్యం షాపుపై దండెత్తిని ఉమాభారతి రాయితో మద్యం షాపుపై దాడి చేశారు. అనంతరం ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చి మరోసారి సంచలనంగా నిలిచారు ఉమాభారతి.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ మద్యంషాపుపై తన అనుచరులతో కలిసి ఓ మద్యం షాపుపై దాడి చేసిన ఉమా భారతి మధ్యప్రదేశ్ లో మద్యపాన నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. లేదంటే సొంత పార్టీ అయినా సరే పోరాటం తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు. ఉమా భారతి మద్యం సీసాలపైకి రాళ్లు విసిరి వాటిని ధ్వంసం చేశారు. అనంతరం రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also read : Uma Bharathi : మా చెప్పులు మోయడానికే అధికారులు పనికొస్తారు: ఉమాభారతి

రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ ఉమాభారతి గతంలో శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఉమాభారతి మండిపడ్డారు. మద్యాన్ని నిషేధించటమే కాదు రాష్ట్రంలో మద్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించడంపై ఉమాభారతి ఆగ్రహం వ్యక్తంచేస్తూ నేరుగా మద్యం షాపులోకి వెళ్లి రాయితో సీసాలను పగులగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఉమాభారతి ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఉమాభారతి జనవరి 15 వరకు గడువు విధించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఉమాభారతి ఇలా స్వయంగా ఆమే రంగంలోకి దిగి మద్యం షాపుపైకి రాళ్లు విసిరారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతానని హెచ్చరించారు.

Also read : Deeply Hurt By Own Word : నా మాటలే నన్ను గాయపరుస్తున్నాయి : ఉమాభారతి పశ్చాత్తాపం

ఉమాభారతి డిమాండ్ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. పైగా శివరాజ్ సింగ్ ప్రభుత్వం మద్యంపై 10 నుంచి 13 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతోపాటు మద్యం ధరలను మరింత తగ్గించనున్నట్లు ప్రభత్వం తెలిపింది. దేశీయ, విదేశీ లిక్కర్‌ను విక్రయించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉన్న దానికంటే నాలుగు రెట్లు అదనంగా ఇంట్లో లిక్కర్‌ను నిల్వచేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వార్షిక ఆదాయం రూ.కోటికి మించి ఉంటే ఇంటి వద్దే షాప్ ప్రారంభించుకోవచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.