17 Minutes Marriage: 7 అడుగులతో..17 నిమిషాల్లో ముగిసిన పెళ్లి

ఈ కరోనా కాలంలో పెళ్లి అనేది వేడుకల కాకుండా ఓ తంతులా మారింది. భాజాలు..భజంత్రీలు..సంగీత్ లు, మెహందీ వేడుకలు..బారాత్ లు ఇలా సందడి సందడిగా జరిగే పెళ్లిళ్లు కేవలం ఓ నామ మాత్రపు తంతులా మారిపోయాయి ఈ కరోనా కాలంలో.ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యూపీలోని షాజహన్‌పూర్ జిల్లాలోని ఓ బీజేపీ నేత పెళ్లి చర్చనీయాంశంగా మారింది. క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జరిగిన వివాహ వేడుక కేవలం 17 నిమిషాల్లో ముగిసింది. వధూవరులు ఏడు అడుగులు వేసి వివాహ తంతు ముగించారు.

17 Minutes Marriage: 7 అడుగులతో..17 నిమిషాల్లో ముగిసిన పెళ్లి

17 Minutes Marriage

17 Minutes Marriage  : ఈ కరోనా కాలంలో పెళ్లి అనేది వేడుకల కాకుండా ఓ తంతులా మారింది. భాజాలు..భజంత్రీలు..సంగీత్ లు, మెహందీ వేడుకలు..బారాత్ లు ఇలా సందడి సందడిగా జరిగే పెళ్లిళ్లు కేవలం ఓ నామ మాత్రపు తంతులా మారిపోయాయి ఈ కరోనా కాలంలో. పెళ్లి ఎంతమంది తక్కువమందితో చేసుకుంటే అంత సేఫ్టీ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. లేదంటే కరోనా బుసలు కొట్టేస్తుంది. పెళ్లి చేసుకున్నామనే సంతోషం ఎక్కువ సేపు నిలవకుండా ఐసోలేషన్ కు పంపేస్తుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో యూపీలోని షాజహన్‌పూర్ జిల్లాలోని ఓ బీజేపీ నేత పెళ్లి చర్చనీయాంశంగా మారింది. అదే సేఫ్ అనిపించేలా ఈ పెళ్లి జరిగింది.

కలాన్ తహసీల్ ప‌రిధిలోని పట్నా దేవ్‌క‌లి శివాలయంలో క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జరిగిన వివాహ వేడుక కేవలం 17 నిమిషాల్లో ముగిసింది. వధూవరులు ఏడు అడుగులు వేసి వివాహ తంతు ముగించారు. బ్యాండ్ లేదు..బాజాల హోరు లేదు… ఊరేగింపు ఊసేలేదు. సందడి లేదు..ప్రశాంతంగా..అసలు అక్కడ పెళ్లి జరిగిందా? అన్నట్లుగా అత్యంత సాదా సీదాగా..కరోనా నిబంధనలు పాటిస్తూ సేఫ్టీగా జరిగిందీ పెళ్లి. పైగా కట్నం అనే మాటే లేకుండా జరిగిందీ ఆదర్శవివాహం.

స్థానిక బీజేపీ నేత పుష్పిందర్ దుబే, ప్రీతి దుబేల వివాహం చాలా చాలా సింపుల్‌గా జ‌రిగింది. ఈ వివాహ వేడుక స్థానికంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివాహ వేడుకకు హాజరైన అతిథులతో సహా వధూవరులు వరకట్న విధానాన్ని వ్యతిరేకిస్తూ యువతకు మంచి సందేశం ఇచ్చారని ప్రశంసించారు. వరకట్న దురాచారం చాలా కుటుంబాల్లో చిచ్చుపెట్టింద‌ని, దీనికి అంద‌రూ స్వ‌స్తి ప‌ల‌కాలని వ‌ధువు ప్రీతి పిలుపునిచ్చారు.