BJP Comments : బీజేపీ నేతల కాంట్రవర్సీ కామెంట్స్‌

మొన్నటికి మొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అగ్నివీరులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మిల‌ట‌రీలో డ్రైవ‌ర్స్‌, ఎల‌క్ట్రిషియ‌న్స్‌, బ‌ట్టలు ఉతికేవారు, హెయిర్ క‌ట్టింగ్ చేసే పోస్టుల్లో అగ్నిప‌థ్ కింద రిక్రూట్ అయిన వారిని ఉపయోగించుకుంటామన్నారు.

BJP Comments : బీజేపీ నేతల కాంట్రవర్సీ కామెంట్స్‌

Bjp

BJP comments : ఒకవైపు ఆందోళనలతో దేశం తగలబడి పోతుంది. అగ్నిపథ్‌పై యువత అగ్గిమీద గుగ్గిలమవుతుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ నేతలు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. ఆందోళనకారులను శాంతింపజేయాల్సింది పోయి మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అగ్నివీరులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. మిల‌ట‌రీలో డ్రైవ‌ర్స్‌, ఎల‌క్ట్రిషియ‌న్స్‌, బ‌ట్టలు ఉతికేవారు, హెయిర్ క‌ట్టింగ్ చేసే పోస్టుల్లో అగ్నిప‌థ్ కింద రిక్రూట్ అయిన వారిని ఉపయోగించుకుంటామన్నారు. దీనిపై యువతతో పాటు విపక్షాలు ఫైర్‌ అయ్యాయి.

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే మరో బీజేపీ జాతీయ నేత కైలాష్‌ అగ్నికి ఆజ్యం పోశారు. బీజేపీ ఆఫీస్‌ ముందు సెక్యూరిటి గార్డు నియామకాల్లో రిటైర్డ్ అగ్నివీర్‌లకు ప్రాధాన్యత ఇస్తామమని వివాదాస్పద వ్యాఖల్యు చేశారు. కైలాష్‌ విజయ్‌ వర్గీయ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ, ఎంఐఎం, శివసేన విమర్శల దాడికి దిగాయి.

Agnipath : ‘అగ్నిపథ్’స్కీమ్ పై భగ్గుమన్ననిరుద్యోగులు..నాలుగేళ్ల తరువాత మా పరిస్థితేంటీ?అంటూ ఆగ్రహం

దేశ యువత రాత్రింబవళ్లు కష్టపడేది సైనికుడిగా దేశం కోసం సేవ చేయడానికే గానీ, బీజేపీ కార్యాలయాల వద్ద కాపలా కాయడానికి కాదు అంటూ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఈ పథకంపై ఉన్న అనుమానాలన్నింటినీ కైలాష్‌ విజయ్‌ వర్గీయ నివృత్తి చేశారంటూ కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామంటూ వ్యాఖ్యానించడం అంటే సాయుధ బలగాలను చిన్న చూపు చూడడమే అని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు.