బీజేపీ మేనిఫెస్టోకు వందకు 200 మార్కులు: శివసేన

మహారాష్ట్రలో బీజేపీ కూటమి పార్టీ శివసేన.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు వందకు 200 మార్కులు వేసింది.

  • Published By: sreehari ,Published On : April 10, 2019 / 08:19 AM IST
బీజేపీ మేనిఫెస్టోకు వందకు 200 మార్కులు: శివసేన

మహారాష్ట్రలో బీజేపీ కూటమి పార్టీ శివసేన.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు వందకు 200 మార్కులు వేసింది.

మహారాష్ట్రలో బీజేపీ కూటమి పార్టీ శివసేన.. మిత్రపక్షం బీజేపీపై ప్రశంసల జల్లు కురిపించింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు వందకు 200 మార్కులు వేస్తున్నట్టు తెలిపింది. బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రస్తావించిన ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదా, అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి పలు హామీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని శివసేన తెలిపింది. కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పొత్తుతో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల సమరంలో ఇరుపార్టీలు పొత్తు కుదుర్చుకుని కూటమిగా పోటీ చేస్తున్నాయి. రామమందిర నిర్మాణానికి 2019 ఆఖరి అవకాశమని, మందిర నిర్మాణం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సేన స్పష్టం చేసింది. 
Read Also : సెలవులు, టూర్లు, ఎన్నికలు: అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..

యూనిఫాం సివిల్ కోడ్, ఆర్టికల్ 370పై రాజీపడిన వారిని చరిత్ర ఎన్నటికీ క్షమించదని పేర్కొంది. ‘బీజేపీ సంకల్ప్ పత్ర’దేశ ప్రజల భావాలను తెలిపేవాటిలో ఒకటి. శివసేన డిమాండ్ లు కూడా ఇందులో ఉన్నాయి. అందుకే ఈ మేనిఫేస్టోకు వందకు 200 మార్కులు ఇస్తాం’ అని శివసేన అనుబంధ పత్రిక సామ్నా ఎడిటోరియల్ కథనంలో ప్రచురించింది.  బీజేపీ మేనిఫెస్టోలో దేశంలో ప్రధాన సమస్యలైన వ్యవసాయం, పేదరికం, చిన్న కార్మికులు, విద్య రంగాలపై ప్రస్తావించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన మంత్ర… పేదరికాన్ని నిర్మూలనపైనే కాకుండా రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు వంటి పలు సమస్యలపై దృష్టిపెట్టినట్టు సేన తెలిపింది.  

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా మోడీ భావోద్వేగ అభ్యర్థనపై శివసేన ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రజలు బీజేపీ ఓటు వేయాల్సిందిగా కోరింది. అమరులైన వీరజవాన్లకు గౌరవ సూచికంగా ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలంటూ శివసేన కోరింది. 

బీజేపీపై విమర్శలు గుప్పిస్తోన్న నేషనల్ కాన్ఫిరెన్స్ లీడర్ (ఎన్సీపీ) ఓమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబుబూ ముఫ్తిపై కూడా శివసేన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఇలాంటి రాజకీయ నేతల నోళ్లు మూయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శివసేన తెలిపింది. 
Read Also : అమేథిలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ