మందేసి బార్ డ్యాన్సర్ తో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే 

  • Published By: chvmurthy ,Published On : September 29, 2019 / 12:03 PM IST
మందేసి బార్ డ్యాన్సర్ తో చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే 

గొంతులోకి ఒక చుక్క మందు దిగిందంటే, కిక్కు ఎక్కి ఏం చేస్తున్నామో కూడా స్పృహ ఉండదు కొందరికి. హోదాకు పెద్దమనుషులైనా మందు కిక్కులో చేసే పనులు వేరేగా ఉంటాయి.
ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే అన్నవిషయం కూడా మర్చిపోయి డ్యాన్స్ చేశాడు.

మహారాష్ట్ర కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే  సంజయ్ పురమ్ మందేసి, ఓ బార్ డ్యాన్సర్ తో చిందేసాడు. ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  బార్ డ్యాన్సర్ తో చిందేశాడు.

డ్యాన్స్ చేస్తూ ఆమెపై డబ్బులు వెదజల్లుతూ రచ్చ రచ్చచేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.దీంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. గాంధీ జల్లాలోని ఆమ్‌గోన్‌-డోరి అసెంబ్లీ స్థానం నుంచి సంజయ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.