చౌకీదార్ MLA కి ఝలక్ ఇచ్చిన పోలీసులు

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 01:42 PM IST
చౌకీదార్ MLA కి ఝలక్ ఇచ్చిన పోలీసులు

కారు నంబర్‌ ప్లేట్‌ పై చౌకీదార్‌ అన్న బోర్డు పెట్టుకున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేకు పోలీసులు షాక్ ఇచ్చారు.నంబర్ ప్లేట్ యాక్ట్ ని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేకు ఫైన్ విధించారు.మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది.

 ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మై భీ చౌకీదార్‌’ అనే నినాదాన్ని ఈ మధ్య బాగా పాపులర్‌ చేసింది. అయితే ఈ నినాదానికి తనపేరును కూడా జోడించి చౌకీదార్‌ పంధాన అని సొంత కార్‌ నెంబర్‌ ప్లేట్‌ మీద రాయించుకున్నారు మధ్యప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే రాం దాంగోర్‌. ఖండ్వా ఎమ్మెల్యే నందకుమార్‌ సింగ్‌ చౌహాన్ ని కలిసేందుకు రాం దాంగోర్ ఖాండ్వాకి వెళ్లారు.

అయితే ఆ సమయంలో ఖాండ్వాలో రంగపంచమి ఉత్సవం జరుగుతన్నకారణంగా పోలీసులు కొన్నిచోట్ల చెక్‌ పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే రాం దాంగోర్‌ వాహనాన్ని రోడ్డుపై వెళ్తున్నప్పుడు నెంబర్‌ ప్లేట్‌ను చూసిన పోలీసులు.. వాహనాన్ని ఆపి నెంబర్‌ ప్లేట్‌ చట్టం ప్రకారం ఫైన్‌ విధించారు. చలాన్‌ వివరాలను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు.అయితే తాను ఎలాంటి నిబంధనల అతిక్రమణలకు పాల్పడలేదని, పోలీసుల ఫైన్‌ విధింపులో కాంగ్రెస్‌ కుట్ర  ఉందని ఎమ్మెల్యే రాం దాంగోర్‌ ఆరోపించారు.