MLA Gyanendra Singh : కశ్మీర్ లోని స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలి

జమ్మూ కశ్మీర్ లోని స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలని బీహార్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను డిమాండ్ చేశారు. దీనివల్ల ఉగ్రవాదుల నుంచి తమను తాము రక్షించుకోవడం

10TV Telugu News

MLA Gyanendra Singh జమ్మూ కశ్మీర్ లోని స్థానికేతరులందరికీ ఏకే-47లు ఇవ్వాలని బీహార్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను డిమాండ్ చేశారు. దీనివల్ల ఉగ్రవాదుల నుంచి తమను తాము రక్షించుకోవడంతో పాటు వారిపై పోరాడగలరని ఎమ్మెల్యే అన్నారు.

కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో మైనార్టీలైన హిందువులు,సిక్కులు సహా ఇతర రాష్ట్రాలకు వలస కార్మికులను ఉగ్రవాదులు కాల్చి చంపుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జ్ఞానేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల శ్రీనగర్​లో బిహార్​కు చెందిన పానీపూరి వ్యాపారిని ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత బాధాకరమన్నారు. పాకిస్తాన్​ ఉగ్రవాదుల సహకారంతోనే ఈ దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

పంజాబ్ లో ఉగ్రవాదం ప్రబలంగా ఉన్నప్పడు..ఏకే-47లు పొందేందుకు పంజాబ్ ప్రజలకు లైసెన్స్ లు ఇవ్వబడ్డాయని..ఇప్పుడు కశ్మీర్ లో కూడా ఇలానే చెయ్యాలని ఎమ్మెల్యే అన్నారు. కశ్మీర్​లో నిరాయుధులు, పేదవాళ్లను చంపడం దారుణమన్నారు. జమ్మూకశ్మీర్ లోని స్థానికేతర పౌరులందరినీ ప్రభుత్వం ఏకం చేయాలని, వారికి వ్యక్తిగత భద్రతతోపాటు ప్రభుత్వ భద్రతను కల్పించాలన్నారు. భద్రతను మరింత పటిష్ఠం చేస్తే ప్రజలు ప్రశాంతంగా జీవించి వ్యాపారాలు చేసుకోగలరన్నారు.

ఇక, కశ్మీర్​లో తమ ప్రాంత ప్రజలపై దాడులు జరుగుతుండటంపై బీహారీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ లో బిహారీ సోదరులను ఉగ్రవాదులు కాల్చి చంపడం అత్యంత బాధాకరమని బీహార్ మాజీ సీఎం హిందుస్థాన్​ ఆవామ్​ మోర్చా(HAM) అధినేత జితన్​ రాం మాంఝీ అన్నారు. కశ్మీర్​లో పౌరుల భద్రతకు కేంద్రం ఎలాంటి ప్రాణాళిక రూపొందిస్తోందని మాంఝీ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం సమస్యను పరిష్కరించలేకపోతే.. బీహారీలకే ఆ బాధ్యత అప్పగించాలన్నారు. 15 రోజుల్లో తాము పరిస్థితిని చక్కదిద్దుకోగలమన్నారు.

ALSO READ  కశ్మీర్ హింసలో పాక్ కుట్ర బట్టబయలు..ఐఎస్ఐ బ్లూప్రింట్ లో సంచలన విషయాలు