TMC: తిరుగులేని శక్తిగా మారేందుకు.. టీఎంసీలోకి బీజేపీ ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. పార్టీలో ముఖ్యమైన నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు.

TMC: తిరుగులేని శక్తిగా మారేందుకు.. టీఎంసీలోకి బీజేపీ ఎమ్మెల్యేలు

Tmc

Bengal BJP MLA Join TMC: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. పార్టీలో ముఖ్యమైన నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోతున్నారు. మంగళవారం(31 ఆగస్ట్ 2021) కూడా, బీజేపీ ఎమ్మెల్యే విశ్వజిత్ దాస్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(TMC)లో చేరారు. దాస్‌తో కలిసి టీఎంసీలో చేరినవారిలో బీజేపీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్ కూడా ఉన్నారు. దాదాపు 24 గంటల్లో బీజేపీకి రెండో ఎదురుదెబ్బ. ఎమ్మెల్యే తన్మయ్ ఘోష్ కూడా అంతకుముందు టీఎంసీలో చేరారు. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారడ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 72 కి తగ్గింది.

బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత కేంద్రంలో బీజేపీని అధికారానికి దూరం చేసేందుకు పావులు కదుపుతోన్న దీదీ.. రాష్ట్రంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష బీజేపీ పార్టీని నిర్వీర్యం చేస్తోంది. బీజేపీ సీనియర్లు ముకుల్ రాయ్, తన్మయ్ ఘోష్ తరువాత, ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే బిశ్వజిత్ దాస్, పార్టీ కౌన్సిలర్ మనోతోష్ నాథ్‌ టీఎంసీ కండువా కప్పుకోవడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు నిపుణులు.

టీఎంసీలో చేరిన బాగ్డా బీజేపీ ఎమ్మెల్యే విశ్వజిత్ దాస్ మాట్లాడుతూ, ‘నేను అయోమయంలో పార్టీ మారాను. ఇప్పుడు TMC నాయకత్వంపై నమ్మకం ఉంచి, మళ్లీ పార్టీలోకి తిరిగి వచ్చాను. మమతా బెనర్జీ అభివృద్ధి పనులు చేస్తున్నారు. నేను ఆమెతోనే ఉండాలని అనుకుంటున్నాను.’ అని అన్నారు.