పొలంలో డ్రీమ్ గర్ల్ : గోధుమ పంటతో హేమమాలిని ప్రచారం

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 05:37 AM IST
పొలంలో డ్రీమ్ గర్ల్ : గోధుమ పంటతో హేమమాలిని ప్రచారం

ఢిల్లీ: నటి..బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమ మాలిని వినూత్న రీతిన స్పందించారు. ఎన్నికల్లో మధుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ పడుతున్న హేమమాలిని తన ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. గోవర్థన క్షేత్ర ప్రాంతానికి వచ్చిన ఆమె గోధుమ పోలాల్లో తిరిగారు. అనంతరం గోధుమ పంట పనలను..కొడవలిని చేతుల్లోకి తీసుకున్నారు. తరువాత పొల్లాల్లో ఉన్న మహిళలతో ముచ్చటించారు.వారి సమస్యలు తెలుసుకున్నారు. 

2014లో తాను గెలిచిన తరువాత నియోజకవర్గానికి చాలా చేశానని..ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు ప్రజలంతా ఓటు వేసి తనను గెలిపించాలని..మరింత పనిచేసే అవకాశం తనకు కల్పించాలని  కోరారు. మధుర ప్రజలు తనపై ఎంతో ఆప్యాయతను చూపిస్తున్నారని, మరోసారి విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని అన్నారు. 2004లో బీజేపీలో చేరిన హేమమాలిని, 2014లో రాష్ట్రీయ లోక్ దల్ అభ్యర్థి జయంతో చౌదరిపై విజయం సాధించారు. కాగా మధురలో మరోసారి పోటీ చేసి గెలవాలనే ఉత్సాహంలో ఉన్నారు హేమమాలిని. ఫిబ్రవరి 18న ఎలక్షన్ జరగనున్న క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గోధుమ పంట పనలను పట్టుకుని ఓట్లు వేయాలని కోరారు. కాగా రెండసారి పోటీలో నిలిచిన హేమమాలిని  ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 101 కోట్లని ఈసీని చూపించారు. ఐదేళ్ల క్రితం ఆమె ఆస్తులతో పోలిస్తే..ఇవి రూ. 34.46 కోట్లు ఎక్కవ అనే విషయం గమనించాల్సిన విషయం.