పీజీ చేయకుండా రాహుల్ ఎంఫిల్ ఎలా చేస్తారు : జీవీఎల్ క్వశ్చన్స్

10TV Telugu News

AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్లపై BJP MP జీవీఎల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ విద్యార్హత..పౌరసత్వంపై వివాదాలున్నాయన్నారు. ఎన్నికల కమిషన్ తరపున రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరినా..రాహుల్ తరపు వివరణనిచ్చే అడ్వకేట్ వద్ద తగిన సమాచారం లేదన్నారు. 
Also Read : నవ్వు ఆగదు : ఫొటోకి ఫోజులిస్తూ నదిలో పడిపోయిన దంపతులు

94లో డిగ్రీ చేసిన రాహుల్..95లో ఎంఫిల్ చేసినట్లు రాహుల్ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లపై ఇప్పుడు జీవీఎల్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు

ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డిగ్రీ తర్వాత పీజీ చేయకుండా రాహుల్ ఎంఫిల్ ఎలా చేస్తారని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నట్లు ఓసారి పేర్కొన్నట్లు..ఆ కంపెనీ ఇచ్చిన వివరాల్లో రాహుల్‌ని బ్రిటీష్ పౌరుడిగా వెల్లడించారని ఆయన అన్నారు. పౌరసత్వం లేకుండా అక్కడి కంపెనీకి తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే..అక్కడి చట్టాల ప్రకారం శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని జీవీఎల్ వెల్లడించారు. 
Also Read : వీడియో వైరల్: రాంగ్‌రూట్‌లోకి వచ్చి.. ఎలా బెదిరిస్తున్నారో చూడండి..