BJP MP Pragya Thakur: సనాతన బోర్డును ఏర్పాటు చేయాలి: బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్
సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ డిమాండ్ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "అప్పట్లో భారత్ లో హిందువులను వేధించారు. బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరింది. అయితే, ఇప్పటికీ దేశంలో పలు బోర్డులు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు వంటివి భూములు తీసుకుంటున్నాయి. అయితే, అవి వారి భూములు కాదు" అని ఆరోపణలు గుప్పించారు.

Keep knives sharpened at home says Sadhvi Pragya
BJP MP Pragya Thakur: సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ డిమాండ్ చేశారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “అప్పట్లో భారత్ లో హిందువులను వేధించారు. బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరింది. అయితే, ఇప్పటికీ దేశంలో పలు బోర్డులు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు వంటివి భూములు తీసుకుంటున్నాయి. అయితే, అవి వారి భూములు కాదు” అని ఆరోపణలు గుప్పించారు.
“హిందువులు తమ సొంత నిబంధనలను పాటిస్తారు. వారి మతం గురించే మాట్లాడతారు. తమ మతాన్ని పాటిస్తారు. ఎక్కడా ఎవరినీ వ్యతిరేకించరు. సతానత దేవతల మందిరాలు ట్రస్టులుగా మారి, ప్రభుత్వ చేతుల్లోకి వెళ్తున్నాయి. వాటి నుంచి స్వేచ్ఛను ఇవ్వాలి. హిందువులు ఇచ్చే నిధులు, మందిరాలకు వచ్చే విరాళాలను హిందువుల అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలి.
హిందువుల పిల్లల చదువులకు వినియోగించాలి. అలాగే, సనాతన ధర్మ అభివృద్ధికి, మందిరాల నిర్మాణాలకు వాడాలి. అందుకే సనాతన బోర్డును ఏర్పాటు చేయాలి” అని ప్రజ్ఞా ఠాకూర్ చెప్పారు. మోదీ ప్రభుత్వ పాలనలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రాయాస్ నినాదంతో పనులు జరుగుతున్నాయని అన్నారు.
సనాతన బోర్డుని ఏర్పాటు చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయని చెప్పారు. హిందూ మతం మన మతమని, మన సొంత నిబంధనలనే మనం పాటించాలని అన్నారు. దానిపై ఎటువంటి దాడీ జరగకూడదని చెప్పారు.
Turkey quake..Bina Tiwari : భూకంప బాధితులకు అండగా భారత్ అర్మీ డాక్టర్ బీనా తివారీ..!