Pragya Thakurs Dance : డ్యాన్స్ చేసిన ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్.. బాస్కెట్ బాల్ ఆటైనా..వ్యాఖ్యలైనా ఆమె స్టైలే వేరప్పా..

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్ పెళ్లిలో చక్కగా డ్యాన్స్ వేసి మరోసారి వైరల్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం బాస్కెట్ బాల్ ఆడి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ అయినా..ఆటైనా..వ్యాఖ్యలు చేయటంలోనే ఆమె స్టైలే వేరప్పా అనేలా ఉండటం ఆమె స్సెషాలిటీ.

Pragya Thakurs Dance : డ్యాన్స్ చేసిన ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్.. బాస్కెట్ బాల్ ఆటైనా..వ్యాఖ్యలైనా ఆమె స్టైలే వేరప్పా..

Mp Prjna Dance

bjp mp pragya thakurs dance : వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞా ఠాకూర్ లో మరో యాంగిల్ కూడా ఉందని నిరూపించారు. ప్రజ్ఞా చక్కగా డ్యాన్స్ వేసి అలరించారు. ఓ పెళ్లికి వెళ్లిన ఆమె చక్కగా డ్యాన్స్ వేశారు. అవ్వటానికి ప్రజ్ఞా సాధ్వియే అయినా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో మాత్రం ముందుంటారామె. కానీ ఆమెలో కూడా వినోదం కలిగించే యాంగిల్ ఉందని డ్యాన్స్ వేసి మరీ నిరూపించారు బీజేపీ ఎంపీ ప్రజ్ఞాఠాకూర్. ఓ పెళ్లి వేడుక‌లో ఎంపీ చాలా హుషారుగా డ్యాన్స్ వేస్తూ కనిపించారు. అంతేకాదు కొన్ని రోజుల క్రితం ఆమె బాస్కెట్ బాల్ ఆడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైలర్ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆమె డ్యాన్స్ వేసి మరోసారి వైరల్ అయ్యారు. అంతేకాదు కొన్ని రోజుల క్రితం ఆమె బాస్కెట్ బాల్ ఆడి వార్తల్లో నిలిచారు. డ్యాన్స్ అయినా..ఆటైనా..వ్యాఖ్యలు చేయటంలోనే ఆమె స్టైలే వేరప్పా అనేలా ఉండటం ఆమె స్సెషాలిటీ.

భోపాల్‌లోని త‌న ఇంట్లోనే ఈమ‌ధ్యే ఇద్ద‌రి అమ్మాయిల పెళ్లి చేసింది ప్ర‌జ్ఞా. అప్ప‌గింత‌ల వేళ డీజే మ్యూజిక్ స‌మ‌యంలో ఆమె స్టెప్పులేశారు. అంతేకాదు.. ఆహ్వానితుల‌ను కూడా డ్యాన్స్ వేద్దాం రమ్మంటూ పిలిచి మరీ డ్యాన్సులు వేయించారు. స‌ర‌దాగా ప్ర‌జ్ఞా డ్యాన్స్ చేస్తున్న వీడియో వైర‌ల్ కావ‌డంతో.. ఇక కాంగ్రెస్ ఎంపీ న‌రేంద్ర స‌లూజా సెటైర్ వేశారు.

ప్రజ్ఞాఠాకూర్ డ్యాన్స్ వేస్తున్న వీడియోను ఎంపీ నరేంద్ర సలూజా పోస్టు చేస్తూ.. ఎంపీ ప్ర‌జ్ఞా ఎప్పుడూ ఇలాగే చెలాకీగా ఉండాలని..ప్రజ్ఞాను ఇలా చూడ‌డం హ్యాపీగా ఉందన్నారు. నిజానికి మాలేగావ్ పేలుళ్ల కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న ప్ర‌జ్ఞా.. ఆరోగ్య కార‌ణాల చేత విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డం లేదు. వీల్‌చైర్‌లో ఉన్న ఆమె .. విచార‌ణ నుంచి మిన‌హాయింపు కోరారు. కానీ బాస్కెట్‌బాల్ ఆడుతూ.. డ్యాన్స్ చేస్తూ క‌నిపించిన ప్ర‌జ్ఞాపై కాంగ్రెస్ ఎంపీ ఇలా సెటైర్ వేశారు.