Ravi Shankar Prasad : రాహుల్ ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్ధాలే : రవిశంకర్ ప్రసాద్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. లోక్ సభ సెక్రటేరియట్ విధించిన అనర్హత వేటుపై మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ స్పందించిన తీరును తప్పుబట్టారు.

Ravi Shankar Prasad : రాహుల్ ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్ధాలే : రవిశంకర్ ప్రసాద్

Ravi Shankar

Ravi Shankar Prasad : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. లోక్ సభ సెక్రటేరియట్ విధించిన అనర్హత వేటుపై మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ స్పందించిన తీరును తప్పుబట్టారు. రాహుల్ ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. రాహుల్ ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరినా రాహుల్ స్పందించ లేదన్నారు.

వాక్ స్వాతంత్ర్యం అంటే దూషించడమేనా అని ప్రశ్నించారు. విమర్శించే హక్కు ఉంది..అవమానించే హక్కు లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగానే వెనుకబడిన తరగతుల వారిని అవమానించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మీడియా ముందు తప్పుడు స్టేట్ మెంట్స్ ఇచ్చారని, అసలు విషయంపై మాట్లాడటం లేదని విమర్శించారు. 2019లో చేసిన ప్రసంగంపైనే రాహుల్ కు శిక్ష పడిందన్నారు.

Ravi Shankar Prasad slams Congress: ఆర్మీపై కాంగ్రెస్ ద్వేషపూరిత వ్యాఖ్యలు: రవిశంకర్ ప్రసాద్

అంతకముందు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భారత్‌లో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందన్నారు. ఇందుకు ప్రతి రోజూ ఒక ఉదాహరణ దొరుకుతోందని చెప్పారు. అదానీ షెల్ కంపెనీల్లో రూ. 20 వేల కోట్ల ఎవరో పెట్టుబడి పెట్టారు? ఆ డబ్బు అదానీది కాదని.. అది ఎవరిదో చెప్పాలని అడిగానని అన్నారు. అదానీ-ప్రధాని మోదీ సంబంధంపై సమగ్రంగా మాట్లాడానని చెప్పారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇదే విషయంపై తాను పార్లమెంటులో మాట్లాడితే, రికార్డుల నుంచి తొలగించారని పేర్కొన్నారు.

విమానాశ్రయాలను అదానీకి గంపగుత్తగా అప్పగించారని విమర్శించారు. ఇందుకోసం నిబంధనలను కూడా మార్చేశారని వెల్లడించారు. పార్లమెంటులో తన గురించి మంత్రులు అనేక ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఒక సభ్యుడిపై ఆరోపణలు చేసినప్పుడు వాటికి జవాబు ఇచ్చే హక్కు ఆ సభ్యుడిగా ఉంటుందన్నారు. ఆ ప్రకారమే స్పీకర్‌ను తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ కోరాను.. కానీ అవకాశం ఇవ్వలేదని చెప్పారు.

Ravi Shankar Prasad: “బాధ్యతారహిత, సిగ్గుమాలిన వ్యాఖ్యలు” అంటూ రాహుల్ పై బీజేపీ తీవ్ర ఆగ్రహం

అదానీ కంపెనీల్లో ఉన్న ఆ రూ. 20 వేల కోట్లు ఎవరివో చెప్పాలని డిమాండ్ చేశానని.. ఇప్పుడు కూడా చేస్తున్నానని తెలిపారు. తాను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడానని.. పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన షెల్ కంపెనీలు డిఫెన్స్ సెక్టార్‌తో ముడిపడి ఉన్నాయని ఆరోపించారు. ఒక చైనా జాతీయుడికి కూడా ఈ పెట్టుబడులతో లింక్ ఉందని.. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో చెప్పాలని అడిగానని పేర్కొన్నారు.