భారత్ లో ఉండటం అంత బాధ ఉంటే.. పాకిస్తాన్ వెళ్లిపోండి : బీజేపీ ఎంపీ

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 11:18 AM IST
భారత్ లో ఉండటం అంత బాధ ఉంటే.. పాకిస్తాన్ వెళ్లిపోండి : బీజేపీ ఎంపీ

కొన్ని రోజులుగా సీఏఏకు వ్యతిరేకంగా అలీగఢ్‌ ఈద్గా కాంప్లెక్స్‌లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో సామాజిక ఉద్యమ కారిణి సుమయా రాణా పాల్గొని ప్రసంగిస్తూ..‘సీఏఏను వ్యతిరేకిస్తూ మనమందరమూ ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలపటం ప్రతీ ఒక్కరి హక్కు. ఇటువంటి నిరసనలు దేశ వ్యాప్తంగా జరగుతున్నాయి. కానీ యూపీలో చేస్తున్న నిరసనలను అడ్డుకోవటానికి లక్నో పోలీసులు ఆందోళన చేస్తున్నవారిపై దారుణంగా వ్యవహరిస్తున్నారనీ ఆందోళనలకు అణచివేయటానికి బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని అటువంటి  చర్యలు ప్రజలకు చాలా బాధ కలిగిస్తాయిని వ్యాఖ్యానించారు. 

యూపీ పోలీసులపై మునావవర్ రానా కుమార్తె సుమియా రాణా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్  తీవ్రంగా మండిపడ్డారు. ’’భారతంపై ఆమెకు చాలా బాధగా ఉంటే పాకిస్తాన్‌కు వెళ్లిపోవచ్చు’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అలీగఢ్ యూనివర్శిటీ విద్యార్థులపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. 

సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని..విద్యార్ధులని ఉపేక్షించవద్దని ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న కొంతమంది విద్యార్ధులు ఆందోళనను విరమించి క్లాసులకు అటెండ్ అవుతున్నారనీ..కానీ ఆందోళనలను కొనసాగిస్తున్న 150 మంది విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరందరినీ పోలీసులు ఇప్పటికే గుర్తించారని..వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి వారు క్యాంపస్‌లో ఉండరని పోలీసులు హామీ ఇచ్చారని కూడా ెంపీ సతీశ్ గైతమ్ తెలిపారు.