కరోనా భయం, స్వీయ నిర్భందంలో మాజీ కేంద్రమంత్రి

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 04:48 AM IST
కరోనా భయం, స్వీయ నిర్భందంలో మాజీ కేంద్రమంత్రి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లోనూ తన విశ్వ రూపం చూపిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు అధికం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నేపథ్యంలో అంతా అలర్ట్ అవుతున్నారు. ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్ అవుతున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి మురళీధరన్ సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు. అదే బాటలో మరో మాజీ కేంద్రమంత్రి పయనించారు. 

సౌదీ నుంచి వచ్చిన సురేష్ ప్రభు:
బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు సైతం సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారు. 14 రోజుల పాటు ఆయన స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. సురేష్ ప్రభు ఇటీవలే సౌదీ అరేబియా వెళ్లి వచ్చారు. జీ20 దేశాల సమ్మేళనం సన్నాహక సమావేశానికి హాజరయ్యారు. సౌదీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి నుంచి వచ్చాక సురేష్ ప్రభుత్వ పరీక్షలు చేయించుకున్నారు. ఆయనకు కరోనా లేదని డాక్టర్లు నిర్ధారించారు. అయినా ముందు జాగ్రత్తగా స్వీయ నిర్బంధం విధించుకున్నారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండనున్నారు. తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ కు సురేష్ ప్రభు లేఖ రాశారు. కరోనా సోకినా 14 రోజుల తర్వాత కానీ లక్షణాలు బయటపడటం లేదు. అందుకే, విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

స్పెయిన్ నుంచి వచ్చిన డాక్టర్ కు కరోనా వైరస్:
కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ మార్చి 14న తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని డైరెక్టర్స్ ఆఫీస్‌లో జరిగిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో వివిధ డిపార్ట్ మెంట్ల అధిపతులు పాల్గొన్నారు. ఇదే మీటింగ్ కు హాజరైన ఓ డాక్టర్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఆ డాక్టర్(రేడియాలజిస్ట్) మార్చి 1న స్పెయిన్ నుంచి తిరిగొచ్చారు. మార్చి 5వరకు ఆ డాక్టర్ హాస్పిటల్ లో పనిచేశారు. అప్పటివరకు ఆయనలో కరోనా లక్షణాలు కనుబడలేదు.

ఆదివారం(మార్చి 15,2020) టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హాస్పిటల్ ను షట్ డౌన్ చేశారు. కరోనా విషయం వెలుగులోకి రావడంతో ఆరు ముఖ్యమైన డిపార్మెంట్లకు హెడ్ లుగా ఉన్న హాస్పిటల్ లోని డాక్టర్లు వాళ్లకు వాళ్లుగా ఇళ్లల్లోనే క్వారంటైన్(నిర్బంధం) అయ్యారు. కరోనా సోకిన డాక్టర్ ను నేరుగా కలిసిన 25మంది డాక్టర్లు సహా 75మంది ఉద్యోగుల లిస్ట్ ను తయారు చేసి వారిని ఐసొలేట్ చేసినట్లు సమాచారం. వాళ్ల కుటుంబసభ్యులను కూడా ఇళ్లల్లోనే ఉండమని అధికారులు సూచించారట.

ఆ హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నందున ముందు జాగ్రత్త చర్యగా తనకు తాను గా క్వారంటైన్ అయ్యారు కేంద్రమంత్రి మురళీధరన్. ఇల్లు దాటి బయటకి రాకూడదని ఆయన నిర్ణయించారు. ఇప్పుడు సురేష్ ప్రభు కూడా అలాంటి నిర్ణయమే తీసుకున్నారు.

See Also | ముందుకు వెళ్లలేక..వెనక్కి రాలేక : కౌలాలంపూర్‌లో తెలుగు విద్యార్థులు విలవిల