ఐదేళ్లల్లో తన వయసు ఒక్క ఏడాదే పెరిగిందన్న బీజేపీ ఎంపీ

  • Published By: venkaiahnaidu ,Published On : March 28, 2019 / 02:16 PM IST
ఐదేళ్లల్లో తన వయసు ఒక్క ఏడాదే పెరిగిందన్న బీజేపీ ఎంపీ

 ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీల టికెట్ పొందడానికి, దానికోసం అధిష్ఠానాన్ని ఆకట్టుకోడానికి రాజకీయ నాయకులు పడే పాట్లు మామూలుగా ఉండవు. ఒక్కోసారి వారు ప్రవర్తించే తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లు గడుస్తున్నా తన వయసు మాత్రం ఒక సంవత్సరమే పెరిగిందంటూ మధ్యప్రదేశ్‌ లోని బీజేపీ ఎంపీ ఇప్పుడు ఇలాంటి గిమ్మిక్కులే చేశారు.బీజేపీ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆ పార్టీలోని పలువురు నేతలను కలవరపెడుతోంది.

మధ్యప్రదేశ్ లోని సాగర్ నియోజకవర్గ ఎంపీ లక్ష్మీ నారాయణ్ యాదవ్ ప్రస్తుతం తన వయసు 74 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నారు. అయితే 2014లో ఆయన ఎన్నికల సంఘం వద్ద దాఖలు చేసిన అఫిడవిట్‌లో మాత్రం 73 సంవత్సరాలని తెలిపారు. దాంట్లో ఆయన ఏ సంవత్సరంలో జన్మించారో మాత్రం రాయలేదు.అయితే దీనిపై ఆయన్ను మీడియా ప్రశ్నించగా..తాను 1944, నవంబరు 9న జన్మించానని, 2014లో అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలు గుర్తు లేవని తెలిపారు. అసలు చిక్కంతా ఎందుకు వచ్చి పడిందంటే….బీజేపీ 75 ఏళ్ల వయసు పైబడిన వారిని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచుతుంది.క్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కు కూడా ఇదే కారణంతో టికెట్ దక్కే అవకాశాలు కన్పించడం లేదు బీజేపీ తీసుకువచ్చిన ఈ విధానం వల్ల ఆశావహులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.