BJP : నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులు.. నియమించిన జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు.

BJP : నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులు.. నియమించిన జేపీ నడ్డా

JP Nadda

BJP : దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలు రాజకీయ పార్టీలు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎన్నికలు, పార్టీ నిర్మాణం, విస్తరణ దృష్ట్యా పార్టీలో మార్పులు చేర్పులు చేస్తున్నాయి. నాయకత్వ స్థాయిల్లో మార్పులు చేస్తున్నాయి. అధ్యక్ష, కార్యదర్శులను మార్చుతున్నారు. ఇందులో భాగంగా భారతీయ జనతా పార్టీలో నాయకత్వ స్థానాల్లో మార్పులు జరుగుతున్నాయి.

భారతీయ జనతా పార్టీ(BJP) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను మార్పు చేసింది. నాలుగు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిశాకు నూతన అధ్యక్షులను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ మేరకు ఆయన గురువారం అధికారికంగా ప్రకటించారు.

Karnataka Polls: ఎటూ తేల్చని బీజేపీ అధిష్టానం.. మళ్లీ ముఖ్యమంత్రి తానేనంటున్న బొమ్మై

బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా సామ్రాట్ చౌదరి, ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్ దేవా, రాజస్థాన్ అధ్యక్షుడిగా సీపీ జోషి, ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడిగా మన్ మోహన్ సామల్ ను నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ ఏడాది ఆఖరిలో రాజస్థాన్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

వచ్చే ఏడాదిలో ఒడిశాలో ఎన్నికలు జరుగున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులను నియమించారు. అలాగే బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు కూడా బీజేపీ అధ్యక్షులను నియమించారు. అయితే, ఒకేసారి నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ నూతన అధ్యక్షులను ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.