Kolhapur Clashes: ఎన్నికల్లో గెలవడానికి ఔరంగజేబు కావాల్సి వచ్చిందా? షిండే, ఫడ్నవీస్‭లకు రౌత్ సూటి ప్రశ్న

ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మారింది.

Kolhapur Clashes: ఎన్నికల్లో గెలవడానికి ఔరంగజేబు కావాల్సి వచ్చిందా? షిండే, ఫడ్నవీస్‭లకు రౌత్ సూటి ప్రశ్న

Maharashtra Politics: మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో చెలరేగిన అల్లర్లపై శివసేన (యూబీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయ జనతా పార్టీ క్రీడలో భాగంగానే ఘర్షణ లేచిందని ఆయన విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా ఎన్నికల్లో గెలవడానికి ఔరంగజేబు కావాల్సి వచ్చిందా అంటూ ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‭ను ప్రశ్నించారు.

No plans to withdraw Rs 500 notes: రూ.500నోట్లపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

‘‘ఈ ఘర్షణలో కొల్హాపూర్ ప్రజలు లేరని నేను బలంగా నమ్ముతున్నాను. కొల్హాపూర్ బయటి నుంచి వచ్చిన ప్రజలే ఇందులో ఉన్నారు. వాళ్లే పట్టణంలో పరిస్థితుల్ని ఘర్షణవైపుకు తీసుకెళ్లారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఇలా మాటి మాటికీ జరగుతున్నాయనేది గమనించాలి. వాళ్లు హిందుత్వ గురించి మాట్లాడతారు. కానీ ఇలా విధ్వేషాలు రెచ్చగొట్టడమేనా వారి హిందుత్వ? ఎన్నికల్లో గెలవడానికి ఔరంగజేబు కావాలా?’’ అని రౌత్ అన్నారు.

Monsoon arrives in Kerala:నైరుతి రుతుపవనాలు కేరళకు వచ్చేశాయ్…ఐఎండీ శాస్త్రవేత్తల చల్లటి కబురు

ఇక బుధవారం అల్లర్లు చెలరేగిన అనంతరం సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఔరంగాజేబును పొగిడేవారు ఈ దేశంలో ఉండకూడదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందూ హృదయనేత బాల్ థాకరే, శివసేన పార్టీ సిద్ధాంతమని, దాని మీదే తాము నిలబడతామని అన్నారు.

Rs 2k Notes: 50 శాతం రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చాయన్న ఆర్‭బీఐ గవర్నర్.. ఇంతకీ ఈ నోట్లను ఎలా మార్పుకోవాలంటే?

ఔరంగజేబ్‌ను కీర్తిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌పై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. ఔరంగజేబును కీర్తిస్తూ పోస్ట్ పెట్టిన యువకుడిని రైట్ వింగుకు చెందిన కొందరు విపరీతంగా కొట్టారు. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెద్దగా మారింది. ఇరు వర్గాలు రోడ్లపైకి వచ్చి హంగామా చేశారు. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. పరిస్థితి విషయమించడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. లాఠీచార్జ్ చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.