ఈడీ ఆఫీస్ కి బీజేపీ బ్యానర్ తగిలించిన శివసేన

ఈడీ ఆఫీస్ కి బీజేపీ బ్యానర్ తగిలించిన శివసేన

“BJP Office” Banner Outside Agency’s Branch పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ మోసం కేసులో శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ భార్య.. వర్ష రౌత్‌ కు ఆదివారం ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ నెల 29న ఆమె ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది.

అయితే, వర్ష రౌత్ కు ఈడీ సమన్లు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు… సోమవారం(డిసెంబర్-28,2020) ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి…ఈడీ కార్యాలయం ముందు ‘భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం’ అనే బ్యానర్ తగిలించి వెళ్లారు. ఓ వీడియోలో….ఒక పోలీసు అధికారి.. బ్యానర్ పెట్టిన వ్యక్తితో మాట్లాడటం కనిపిస్తోంది. బహుశా అతన్ని ఆపుతున్నట్లు ఉంది. ఆ వ్యక్తి మరాఠీలోని అధికారికి..మీరు BMC కి ఫిర్యాదు చేయండి అని చెబుతాడు.

మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. తన వద్ద బీజేపీకి సంబంధించిన ఫైల్ ఉందని..అందులో 121 పేర్లు ఉన్నాయని, దానిని త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఇస్తానని పేర్కొన్నాడు. బీజేపీ ఆఫీస్ ఈడీ బ్రాంచి అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే లేదా వారితో పొత్తు పెట్టుకోని ప్రతి ఒక్కరినీ మౌనంగా ఉంచడానికి లేదా ఒత్తిడి చేయడానికి కేంద్ర ఏజెన్సీలను బీజేపీ ప్రభుత్వం ఉపయోగిస్తోందని సంజయ్ రౌత్ విమర్శించారు.

కాగా, సమన్ల విషయమై బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘‘శివసేన నేత సంజయ్ రౌత్‌.. దయచేసి మీరు ఒక స్పష్టత ఇవ్వండి. మీ భార్య వర్షకు పీఎంసీ బ్యాంక్‌ దర్యాప్తుకు సంబంధించి హెచ్‌డీఐఎల్ ఫండ్స్‌కు సంబంధించి నవంబర్ 4వ వారంలో డిసెంబర్ 2వ వారంలో, డిసెంబర్ 4వ వారంలో మూడు సమన్లు (నోటీసులు) పంపించింది. దీనిపై ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో స్పందించేందుకు సంజయ్ రౌత్ ఎందుకు నిరాకరించారు? ఎందుకు ఆయన కుటుంబ సభ్యులు హెచ్‌డీఐఎల్ ద్వారా పీఎంసీ బ్యాంకు డబ్బు తీసుకున్నారు? సంజయ్‌ రౌత్‌కు హెచ్‌డీఐఎల్‌తో ప్రవీణ్‌ రౌత్‌తో ఉన్న సంబంధం ఏమిటి?’’ అని బీజేపీ సీనియర్ నేత కిరిట్ సోమయ్య వరుస ట్వీట్లు చేశారు.

సోమయ్య వ్యాఖ్యలను సంజయ్ రౌత్ గట్టిగానే తిప్పికొట్టారు. ఇళ్లలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం పిరికిపందల చర్య. మేము ఎవరికీ భయపడటం. తగిన విధంగా స్పందిస్తాం. ఈడీకి కొన్ని పేపర్లు అవసరం. సకాలంలో వాటిని సమర్పిస్తాం’ అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. తనపై బీజేపీ నేతలకు ఉన్న అసహనానికి నిదర్శనమే ఈడీ చర్య అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది మహా ఘట్ బంధన్ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పాటులో తన పాత్ర, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకపోవడమే వారి అసహనానికి కారణమని రౌత్ అన్నారు.