BJP-RSS: ఆర్ఎస్ఎస్, బీజేపీలు లక్ష్మీదేవి, దుర్గా మాతలపై దాడి చేశారు -రాహుల్ గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) మరియు BJPని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

BJP-RSS: ఆర్ఎస్ఎస్, బీజేపీలు లక్ష్మీదేవి, దుర్గా మాతలపై దాడి చేశారు -రాహుల్ గాంధీ

Rahul

Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) మరియు BJPని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆరెస్సెస్ బూటకపు హిందువులని, తమ స్వప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటాయని, స్వలాభం కోసం మాత్రమే మతాన్ని మాత్రమే ఉపయోగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మహిళా విభాగం ‘ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్’ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఆర్‌ఎస్‌ఎస్ మరియు బీజేపీ వాళ్లు ‘మహిళా శక్తిని’ అణచివేసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు.

డీమోనిటైజేషన్ మరియు GST గురించి ప్రస్తావిస్తూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ‘లక్ష్మీ కి శక్తి’ మరియు ‘దుర్గా కి శక్తి’ పై దాడి చేసిందని అన్నారు. వారు (ఆర్‌ఎస్‌ఎస్ మరియు బిజెపి) తమను తాము హిందూ పార్టీ అని చెప్పుకుంటారని, లక్ష్మీ జీ మరియు దుర్గ మాతపై దాడి చేశారని విమర్శించారు. వారు తప్పుడు హిందువులని, హిందూ మతాన్ని ఉపయోగించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.

కరోనాను నిరోధించడానికి 6 అడుగుల దూరం చాలదు, ఆఫీసుల కన్నా ఇళ్లలోనే ప్రమాదం ఎక్కువ

బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ప్రజలు దేశవ్యాప్తంగా భయాన్ని వ్యాప్తి చేశారని అన్నారు. రైతులు భయపడేలా.. మహిళలు ఇబ్బంది పడేలా జగన్ పాలన సాగుతోందని అన్నారు. ఆర్‌ఎస్ఎస్ మహిళా శక్తిని అణిచివేస్తుందని, అయితే కాంగ్రెస్ మహిళా శక్తికి సమాన అందిస్తుందని అన్నారు. గత 100-200 సంవత్సరాలలో ఎవరైనా హిందూమతాన్ని ఉత్తమంగా అర్థం చేసుకుని, ఆచరిస్తే అది మహాత్మా గాంధీయని అన్నారు.

గాంధీ కుటుంబంలో ఫస్ట్ టైమ్.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ?

మహాత్మా గాంధీ అహింసను ఉత్తమ మార్గంలో నడిపించారని, హిందూమతం పునాది అహింస. అయినప్పటికీ, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ద్వారా మహాత్మా గాంధీని ఎందుకు కాల్చి చంపారు? అనే దాని గురించి ఆలోచించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల భావజాలానికి కాంగ్రెస్ భావజాలం పూర్తి వ్యతిరేకమని చెప్పారు.

ఆర్‌ఎస్‌ఎస్ మరియు బీజేపీ సిద్ధాంతాలను వ్యతిరేకించడంలో ఎప్పుడూ రాజీపడనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ భావజాలం గాంధీ సిద్ధాంతం. గాడ్సే మరియు సావర్కర్ సిద్ధాంతాలకు మరియు మన సిద్ధాంతానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.