ఢిల్లీ ప్రచారంలో….AI టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోలు షేర్ చేసిన బీజేపీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2020 / 09:34 AM IST
ఢిల్లీ ప్రచారంలో….AI టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోలు షేర్ చేసిన బీజేపీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. కేజ్రీవాల్ కే మరోసారి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు ఢిల్లీ ఓటర్లు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ ఆశక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ….తమ ఢిల్లీ పార్టీ చీఫ్ మనోజ్ తివారీ యొక్క రెండు డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసేందుకు ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్(AI)టెక్నాలజీని ఉపయోగించినట్లు ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో నిజంగానే వివిధ ఓటర్ గ్రూప్ లకు బీజేపీకే ఓటు వేయాలని రెండు బాషల్లో మనోజ్ తివారీ చెబుతున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. అసలు ఆ వీడియో చూసినవారికి ఎవ్వరికైనా నిజంగా మనోజ్ తివారీనే రెండు బాషల్లో వీడియోలో మాట్లాడింది అని అనిపించేలా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి డీఫ్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేసింది బీజేపీ.

మనోజ్ తివారీ నిజంగా మాట్లాడినట్లు ఉన్న రెండు ఫేక్ వీడియోలలో…ఒక వీడియోలో హర్యాన్వీ భాషలో మాట్లాడిన తివారీ అరవింద్ కేజ్రీవాల్,ఆమ్ ఆద్మీ పార్టీ వాగ్దానాల గురించి విమర్శిస్తూ మాట్లాడారు. అయితే ఒరిజినల్(నిజమైన)వీడియోలో అదే వ్యాఖ్యలను తివారీ మాట్లాడినప్పటికీ…హిందీ భాషలో ఆయన మాట్లాడాడు. అతను మాట్లాడే భాషను అనుకరించే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్, లిప్ సింకింగ్  తప్ప ప్రతి గెస్చర్, ప్రతి ఫ్రేమ్ ఒకేలా ఉంటాయి.

శుభాకాంక్షలు,పౌరసత్వ సవరణ చట్టం యొక్క బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది అని మనోజ్ తివారీ మరో వీడియోలో హిందీలో మాట్లాడాడు. ఈ వీడియోలు 5,800వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయబడ్డాయని బీజేపీ తెలిపింది. చాలామంది ప్రజలు ఈ వీడియోలు చాలా ఆశక్తిగా ఉన్నాయని,ముఖ్యంగా హర్యాన్వీ భాషలో మాట్లాడినట్లు ఉన్న వీడియో అని ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజలు దీనిని ఇష్టపడ్డారని,మనమెందుకు ఇంగ్లీష్ లో కూడా ఇలా చేయకూడదు అని అడిగారని ఢిల్లీ బీజేపీ మీడియా ఇన్ ఛార్జ్ నీల్ కంత్ భక్షి తెలిపారు.

ఈ సర్వీసుల కోసం తాము ఎవరినీ నియమించుకోలేదని,డబ్బులు చెల్లించలేదని,తాము ఏ కంపెనీతో సంబంధాలు లేదని భక్షి తెలిపారు. అయితే చంఢీఘర్ ప్రధాన కేంద్రంగా పనిచేసే సంస్థ ఐడియాజ్ ఫ్యాక్టరీ  బీజేపీ కోసం ఢీఫ్ ఫేక్ కంటెంట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే క్లయింట్-ఏజెన్సీ రిలేషన్ షిప్ కారణంగా తాము ఈ విషయంపై ఎలాంటి కామెంట్ చేయబోమని కంపెనీ తెలిపింది. అంతకుముందు ఇదే కంపెనీ బీజేపీతో తమకు అంగీకారం కుదిరిందని చెప్పింది.

ఎన్నికలలో డీప్‌ఫేక్ వీడియోలు మరియు ఆడియో కంటెంట్ విస్తృతంగా ఉపయోగించబడలేదని AI భద్రతా విశ్లేషకులు అంటున్నారు. అయితే రాజకీయ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి వారు దుర్వినియోగం చేయడంపై భయాలు ఉన్నాయన్నారు.  ఉదాహరణకు, ఒక రాజకీయ పార్టీ తమ ప్రత్యర్థి మాట్లాడుతున్నట్లుగా లేదా వివాదాస్పదంగా ఏదో చేస్తున్నట్లుగా కనిపించేలా డీప్‌ఫేక్ కంటెంట్‌ను సృష్టించవచ్చు.

అయితే తమ సొంత నాయకుడి కోసం సాంకేతికతను సానుకూలంగా ఉపయోగించుకున్నామని, ఏ ప్రత్యర్థిని దెబ్బతీసేందుకు ఉపయోగించలేదని బీజేపీ చెబుతోంది. పాజిటివ్ ఎన్నికల ప్రచారం కోసం డీప్‌ఫేక్ టెక్నాలజీ భారతదేశంలో ప్రారంభమైంది, బహుశా ఇది ప్రపంచంలోనే మొదటిది.

Read More>>చిత్తూరు: కుటుంబాలను వెలివేసి..ఇళ్ల చుట్టూ ఇనుప కంచె కట్టేసిన నెర్నపల్లి గ్రామ పెద్దలు