Uttar Pradesh Violence: పార్టీ నేత‌లు నురూప్ శర్మ, న‌వీన్ కుమార్‌పై బీజేపీ స‌స్పెన్ష‌న్‌

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయ‌కురాలు నురూప్ శర్మ‌తో పాటు ఆ పార్టీ నేత న‌వీన్ కుమార్ జిందాల్‌ను ఆ పార్టీ అధిష్ఠానం స‌స్పెండ్ చేసింది.

Uttar Pradesh Violence: పార్టీ నేత‌లు నురూప్ శర్మ, న‌వీన్ కుమార్‌పై బీజేపీ స‌స్పెన్ష‌న్‌

Nurup Sharma

Uttar Pradesh Violence: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయ‌కురాలు నురూప్ శర్మ‌తో పాటు ఆ పార్టీ నేత న‌వీన్ కుమార్ జిందాల్‌ను ఆ పార్టీ అధిష్ఠానం స‌స్పెండ్ చేసింది. నురూప్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల‌ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏ మ‌తానికి చెందిన వారిని అయినా కించ‌ప‌ర్చేలా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదంటూ బీజేపీ ఓ ప్ర‌క‌ట‌న చేసిన కొద్ది సేప‌టికే నురూప్ శర్మ‌తో పాటు న‌వీన్ కుమార్‌పై బీజేపీ వేటు వేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు బీజేపీ అధిష్ఠానం స‌స్పెన్ష‌న్ ఆర్డ‌ర్‌ను జారీ చేసింది.

BJP: అవ‌మానించేలా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు: యూపీలో హింస‌పై బీజేపీ స్పంద‌న‌

పార్టీ వైఖ‌రికి విభిన్నంగా ప్ర‌వ‌ర్తించినందుకు గాను వారిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు పార్టీ కేంద్ర క్ష‌మ‌శిక్ష‌ణ క‌మిటీ సెక్ర‌ట‌రీ మెంబ‌ర్ ఓం పాఠక్ ఓ పేర్కొన్నారు. అయితే, నురూప్ శ‌ర్మ‌, న‌వీన్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లు, యూపీలో చెల‌రేగిన హింస అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించ‌లేదు. మ‌రోవైపు, ఇప్ప‌టికే పోలీసులు నురూప్ శ‌ర్మ‌పై కేసు న‌మోదు చేశారు. కాగా, యూపీలో జ‌రిగిన‌ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లపై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తోన్న యూపీ పోలీసులు ఇప్ప‌టికే 36 మందిని అరెస్టు చేశారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల కుట్ర‌దారుల‌పై గ్యాంగ్‌స్ట‌ర్ చ‌ట్టం కింద‌ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.