JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నద్దా పదవీ కాలం పొడిగింపు.. 2024 లోక్‌సభ ఎన్నికలు నద్దా నాయకత్వంలోనే

మోదీ, నద్దా నాయకత్వంలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలు నద్దా ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టమైంది. మరోవైపు ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.

JP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నద్దా పదవీ కాలం పొడిగింపు.. 2024 లోక్‌సభ ఎన్నికలు నద్దా నాయకత్వంలోనే

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నద్దా పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జేపీ నద్దాను 2024 జూన్ వరకు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

Chandigarh: ఒక్క ఓటు తేడాతో మేయర్ సీటు దక్కించుకున్న బీజేపీ.. చండీగఢ్ మేయర్‌గా అనూప్ గుప్తా

మోదీ, నద్దా నాయకత్వంలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికలు నద్దా ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టమైంది. మరోవైపు ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇవి కూడా మోదీ, నద్దా ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరగడంలో జేపీ నద్దా పాత్ర కూడా ఉందని ప్రశంసించారు. కోవిడ్ సమయంలో అనేక సహాయ కార్యక్రమాల్లో జేపీ నద్దా పాల్గొన్నారని అమిత్ షా గుర్తు చేశారు. నేటి జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నద్దా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అమిత్ షా వెల్లడించారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం: వైసీపీ నేత, నటుడు అలీ

రాబోయే ఎన్నికల్లో 2019 నాటి కంటే ఎక్కువ సీట్లతో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అమిత్ షా అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటితో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నద్దా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్ సహా పలువురు నేతలు పాల్గొంటారు. ప్రధాని కీలకోపన్యాసం చేస్తారు.