GOA Election 2022 : గోవాలో 38 స్థానాల్లో బీజేపీ పోటీ…జనవరి 16న అభ్యర్థుల ప్రకటన

జనవరి 16 తర్వాత...పార్టీ అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కోర్ కమిటీతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక్కడ జరిగే ఎన్నికలకు...

GOA Election 2022 : గోవాలో 38 స్థానాల్లో బీజేపీ పోటీ…జనవరి 16న అభ్యర్థుల ప్రకటన

Goa

GOA BJP : గోవాలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. 38 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు జాబితాను ఆమోదించిన తర్వాత…జనవరి 16 తర్వాత…పార్టీ అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటిస్తారని భావిస్తున్నారు. పేర్లను ఖరారు చేసేందుకు బీజేపీ కోర్ కమిటీతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఇక్కడ జరిగే ఎన్నికలకు పార్టీ ఇన్ ఛార్జ్ గా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు సదానంద్ షేట్, సీఎం ప్రమోద్ సావంత్ తదితరులు సమావేశాలకు అధ్యక్షతన వహిస్తున్నారు.

Read More : Hero : మహేష్ మేనల్లుడి కోసం నటుడిగా మారిన అనిల్ రావిపూడి

Benaulim, Nuvem రెండు నియోజకవర్గాల్లో క్రైస్తవులు అధికంగా ఉంటారు. గత నెలలో తృణముల్ కాంగ్రెస్ లో చేరిన ఎన్సీపీ ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో..Benaulim నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. Nuvem నియోజకవర్గం నుంచి Wilfred D’Sa ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇతను గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. కానీ…తర్వాత బీజేపీ కండువా కప్పుకున్నారు.

Read More : Bomb Found : ఢిల్లీలో బాంబు కలకలం..నిర్వీర్యం చేసిన బాంబు స్క్వాడ్

అయితే..కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ బీజేపీ నాయకత్వంపై మండిపడ్డారు. పనాజీ నియోజకవర్గం నుంచి Atanasio Monserrateకు టికెట్ వస్తే..తాను మౌనంగా కూర్చొనని స్పష్టం చేశారు. 25 సంవత్సరాలుగా ఆయన తండ్రి పారికర్ ప్రాతినిధ్యం వహిస్తున్న పనాజీ సీటును ఉత్పల్ ఆశిస్తున్నారు. మనోహర్ పారికర్ కుమారుడన్న కారణంగా ఉత్పల్ కు పార్టీ టికెట్ ఇవ్వలేమని బీజేపీ గోవా ఇన్ ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పడం ఉత్పల్ ఆ విధంగా స్పందించారు.

Read More : Anasuya : ‘బంగార్రాజు’లో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదు.. స్టేజి పైనే డైరెక్టర్‌ని అడిగేసిన అనసూయ

ప్రస్తుతం గోవాలో 40 స్థానాలున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 14వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. 2017లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించింది. కానీ..సాధారణ మెజార్టీ 21 కాగా..కాంగ్రెస్ కేవలం 17 సీట్లు సాధించి..అధికార పీఠానికి కొద్దిదూరంలో ఆగిపోయింది. బీజేపీకి 13 సీట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతు తీసుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ పార్టీ బలం పెరిగిపోయింది.