UP Election : యూపీ మళ్లీ బీజేపీదే!..ఎస్పీకి సెకండ్ ప్లేస్ తప్పదంటున్న తాజా సర్వే

వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని చేజిక్కుంచుకొని 2024లో

UP Election :  యూపీ మళ్లీ బీజేపీదే!..ఎస్పీకి సెకండ్ ప్లేస్ తప్పదంటున్న తాజా సర్వే

Up (1)

UP Election: వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని చేజిక్కుంచుకొని 2024లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి రూట్ క్లియర్ చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా..ఎలాగైనా ఈ సారి అధికారంలోకి వచ్చి తీరాలని ఎస్పీ,బీఎస్పీ పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అటు కాంగ్రెస్ కూడా యూపీ ఎన్నికల్లో సత్తా చూపించేందుకు రెడీ అవుతోంది. స్వయంగా ప్రియాంకగాంధీ రంగంలోకి దిగి యూపీలో హస్తం పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఓ సర్వే విపక్షాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుండగా..బీజేపీలో కూడా టెన్షన్ పుట్టిస్తోంది.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రజల నాడి తెలుసుకునేందుకు పలు మీడియా సంస్థలు ఆ రాష్ట్రంలో ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. టైమ్స్ నౌ-పోల్‌స్ట్రాట్ ఒపీనియన్ పోల్‌లో…యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావచ్చని తేలింది. అయితే సీట్ల వారీగా చూస్తే బీజేపీకి భారీ నష్టం వాటిల్లుతుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 312 సీట్లు గెలుచుకున్న బీజేపీకి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో 239-245 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. అయితే ఈ సీట్లన్నిటితో పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఏ మాత్రం కొంచెం తేడా వచ్చిన మెజార్టీకి కొద్ది దూరంలో బీజేపీ ఆగిపోవాల్సి వస్తుంది. కాగా, 403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో మెజారిటీకి 202 సీట్లు కావాలి.

ఇక,అయితే 2017తో పోలిస్తే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఈసారి స్థానాలు పెరుగుతాయని సర్వే తెలిపింది. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి కేవలం 47 సీట్లు మాత్రమే రాగా, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో 119-125 సీట్లతో రెండో స్థానంలో ఉండొచ్చని సర్వే తెలిపింది. మరోవైపు, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 28-32 సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. 2017ఎన్నికల్లో బీఎస్పీకి 19 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక, ప్రియాంక గాంధీ వాద్రా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ఓటర్లను కాంగ్రెస్ ఆకట్టుకునేలా కనిపించడం లేదు.

ప్రాంతం వారీగా 

బుందేల్‌ఖండ్ ప్రాంతంలో మొత్తం 19 సీట్లు ఉండగా… అందులో బీజేపీకి 15-17 సీట్ల, ఎస్పీకి 0-1 సీట్లు,బీఎస్పీకి 2-5 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 1-2 సీట్లు మాత్రమే దక్కుతాయని అంచనా.
పూర్వాంచల్‌లోని 92 సీట్లలో… బీజేపీ 47-50 సీట్లు, ఎస్పీకి 31-35 సీట్లు వచ్చే అవకాశముంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 40-42 సీట్లు, ఎస్పీకి 21-24 సీట్లు, బీఎస్పీకి 2-3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

మరోవైపు,ఇటీవల విడుదల ఏబీపీ-సీఓటర్ సర్వే ఫలితాల్లో కూడా ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావచ్చుని తేలింది. ఈ సర్వేలో బీజేపీ 213-221, ఎస్పీ 152-160, బీఎస్పీ 16-20, కాంగ్రెస్ 6-10, ఇతరులకు 2-6 సీట్లు రావచ్చని తేలింది.

ALSO READ Union Minister Helps Passenger : విమానంలో తోటి ప్రయాణికుడికి కేంద్రమంత్రి సాయం..ప్రశంసించిన మోదీ