Arvind Kejriwal: ‘కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకే ఈ దాడి జరిగింది’

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ వర్కర్లు ఆందోళన చేయడం, సెక్యూరిటీగా ఉన్న పోలీసులతో ఘర్షణకు దిగడం వంటివి చేశారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు..

Arvind Kejriwal: ‘కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకే ఈ దాడి జరిగింది’

Kezriwal House

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద బీజేపీ వర్కర్లు ఆందోళన చేయడం, సెక్యూరిటీగా ఉన్న పోలీసులతో ఘర్షణకు దిగడం వంటివి చేశారు. దీంతో కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ద కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆప్ పార్టీ నాయకులు విమర్శలు చేశారు. దీనిపై స్పందిస్తూ కశ్మీరీ హిందువుల మారణహోమాన్ని కేజ్రీవాల్ కించపరిచారంటూ కామెంట్ చేశారు.

దాడి జరిగిన కొద్దిసేపటికే మీడియాతో మాట్లాడిన ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌ను ఎన్నికల్లో ఓడించలేక పోతుండటంతో బీజేపీ”చంపాలని” భావిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు ఒక సాకు మాత్రమేనని, ఇది స్పష్టమైన క్రిమినల్ కేసు అని ఆయన అన్నారు.

ఈరోజు బీజేపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారని, ఎన్నికల్లో ఓడించలేకనే ఆయన్ను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం నివాసం బయట ఉన్న రికేడ్ వద్ద కాశ్మీరీ పండిట్‌లను “అవమానించడాన్ని” ఖండిస్తూ బీజేపీ జెండాలతో, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న సమూహం వైరల్ అవుతున్న ఫొటోల్లో కనిపిస్తున్నాయి. పోలీసులతో ఘర్షణ పడుతున్నట్లుగా అందులో కనిపిస్తుంది.

Read Also: చూడాల్సిన సినిమా అయితే యూట్యూబ్ లో అప్‌లోడ్ చేయండి

బీజేపీ యువ మోర్చా నుంచి 150 – 200 మంది కార్యకర్తలు సీఎం నివాసానికి ఉదయం 11గంటల 30నిమిషాలకు చేరుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ద కశ్మీరీ ఫైల్స్ గురించి చేసిన కామెంట్లుపై ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి ఆందోళనకారులను వెంటనే తొలగించామని.. ఒక 70మందిపై లీగ్ యాక్షన్ తీసుకోనున్నట్లు తెలిపారు. ఇవన్నీ సీసీ టీవీల్లో రికార్డ్ అయిందని వాటిని రిలీజ్ చేసినట్లు వెల్లడించారు.