Narayan Rane : మార్చి కల్లా మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం!
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోతుందా?బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో తర్వలో రానుందా?తాజాగా కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన

Mva
Narayan Rane మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా?మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోతుందా?బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో తర్వలో రానుందా?తాజాగా కేంద్రమంత్రి నారాయణ్ రాణే చేసిన కీలక వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రజలలో ఈ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మూడు పార్టీల మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రలో ఎక్కువ కాలం మనుగడ సాగించదని రాణే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహా పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారాయి.
రెండు రోజుల రాజస్తాన్ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి నారాయణ్ రాణే గురువారం జైపూర్ లో మీడియాతో మాట్లాడుతూ..అతి తర్వలో మహారాష్ట్రలో మార్పు కనిపిస్తుందన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా…“నేను కొన్ని విషయాలు వెల్లడించలేను. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా కొన్ని విషయాలను గోప్యంగా ఉంచాలి”అని కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే అనారోగ్యంతో ఉన్నారని, కాబట్టి ఆయన గురించి ఇప్పుడు మాట్లాడవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తమకు చెప్పారన్నారు. కాగా,రెండు వారాల కింద ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ హాస్పిటల్ డాక్టర్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెన్నెముకకు సర్జరీని విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
ALSO READ International Flights : డిసెంబర్-15 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం