Sanjay Nishad : బీజేపీకి మిత్రపక్షం హెచ్చరిక..మంత్రి పదవి ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయ్

కేంద్ర కేబినెట్ విస్తరణలో తన కుమారుడికి స్థానం కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మిత్ర పక్షమైన నిషద్ (నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్) పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Sanjay Nishad : బీజేపీకి మిత్రపక్షం హెచ్చరిక..మంత్రి పదవి ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయ్

Nishad

Sanjay Nishad కేంద్ర కేబినెట్ విస్తరణలో తన కుమారుడికి స్థానం కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మిత్ర పక్షమైన నిషద్ (నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్) పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నాటి మెగా కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినప్పుడు తన కుమారుడు, సంత్ కబీర్ నగర్ ఎంపీ అయిన ప్రవీణ్‌ నిషద్‌కు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు.

నిషద్ సామాజిక వర్గం ఇప్పటికే బీజేపీ నుంచి దూరమవుతోందని.. ఒకవేళ ఈ తప్పిదాన్ని బీజేపీ సరిదిద్దుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు అని సంజయ్ నిషద్ హెచ్చరించారు. ఆప్నాదళ్ కొన్ని సీట్లకు పరిమితమని… తమ సామాజిక వర్గం 160 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావితం చేస్తుందని సంజయ్ నిషద్ తెలిపారు.

తన అభిప్రాయాలను ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వివరించారని, నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని, ప్రవీణ్​ నిషాద్‌కు సరైన స్థానం కల్పిస్తారని నమ్ముతున్నానని సంజయ్ నిషాద్ తెలిపారు.