జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో 81సీట్లు గెలిచిన బీజేపీ…మోడీ అభినందనలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 25, 2019 / 09:26 AM IST
జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో 81సీట్లు గెలిచిన బీజేపీ…మోడీ అభినందనలు

గురువారం జమ్మూకశ్మీర్ లో జరిగిన బ్లాక్ బెవలప్ మెంట్ కౌన్సిల్(BDC)ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. కొత్త,యువ నాయకత్వం అంటూ ఈ ఎన్నికలను మోడీ అభివర్ణించారు. జమ్మూ,కశ్మీర్,లఢఖ్ లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకముందని చెప్పడానికి ఇంతకుమించిన సాక్ష్యం లేదని మోడీ ఇవాళ(అక్టోబర్-25,2019)ట్వీట్ చేశారు. క్షేత్రస్థాయిలో పాలనకు వాళ్లు ఆమోదం తెలిపారన్నారు. 1947నుంచి మొదటిసారిగా  జమ్మూ,కశ్మీర్,లఢఖ్ లో బ్లాక్ బెవలప్ మెంట్ కౌన్సిల్(BDC) ఎన్నికలు జరిగాయన్నారు. ఎటువంటి అల్లర్లు,హింస లేకుండా ప్రశాంతంగా 98శాతం పోలింగ్ నమోదవడం చారిత్రకమన్నారు. 

ఆర్టికల్ 370రద్దు చేస్తూ భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలకు ధన్యవాదాలు, యువ, డైనమిక్ ప్రతినిధులు జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాల ప్రజల తలరాతను మారుస్తారు. జమ్మూ కశ్మీర్ విషయంలో చారిత్రాత్మక నిర్ణయాలకు గాను పార్టీలకు అతీతంగా ఎంపీలను మరోసారి అభినందిస్తున్నాను అంటూ మోడీ ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ చరిత్రలో మొదటిసారిగా 310బ్లాక్స్ లో 1,080మంది అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్,నేషనల్ కాంగ్రెస్(NC),పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(PDP),CPI(M) ఈ ఎన్నికలను బాయ్ కాట్ చేశాయి. రాష్ట్ర యంత్రాంగం విచిత్రమైన వైఖరితో వ్యవహరిస్తోందని, కశ్మీర్ నాయకులను ఇంకా గృహనిర్భంధంలో ఉంచారని ఆరోపిస్తూ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నాయి.

ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా,ముందుజాగ్రత్త చర్యగా పలువురు నాయకులను గృహనిర్భంధంలో,అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కొందరు నాయకులను విడుదల చేశారు. ఫరూక్ అబ్దుల్లా,ఒమర్ అబ్దుల్లా,మెహబూబా ముఫ్తీ వంటి ముఖ్యనాయకులు మాత్రం ఇప్పటికీ గృహనిర్బంధంలో ఉన్నారు.