Block Development : ఒకే ఆఫీసులో భార్య చీఫ్..భ‌ర్త స్వీప‌ర్

తను స్వీపర్ గా పనిచేసే ఆఫీసుకే తన భార్య చీఫ్ అవుతుందని ఆ భర్త అస్సలు ఊహించలేదు.కానీ జరిగింది. ఒకే ఆఫీసులో భార్య చీఫ్ హోదాలో ఉంటే అదే ఆఫీసులో భర్త స్వీపర్ గా పనిచేస్తున్నాడు.

Block Development : ఒకే ఆఫీసులో భార్య చీఫ్..భ‌ర్త స్వీప‌ర్

Wife Chief In Same Office..husband Sweeper

Wife chief in same office..husband sweeper : సినిమాల్లో చూస్తుంటాం. కొడుకు అధికారి అయితే అదే ఆఫీసులో తండ్రి గుమాస్తాగానో..లేదా స్వీపర్ గా పనిచేస్తుంటారు. లేదా భర్త భార్యను కలెక్టర్ ని చేసేస్తాడు. కానీ నిజజీవితంలో అటువంటివి జరిగితే ఇది సినిమాస్టోరీ అంటాం. అదిగో అచ్చు అటువంటి స్టోరీయే ఈ భార్యాభర్తలది.కానీ కాస్త డిఫరెంట్. ఒకే ఆఫీసులో భార్య చీఫ్ హోదాలో ఉంటే అదే ఆఫీసులో ఆమె భర్త స్వీపర్ గా పనిచేస్తున్నాడు. బహుశా ఇటువంటిది జరుగుతందని బహుశా ఆ భర్త కలలో కూడా అనుకుని ఉండడు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఇటీవల బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో బ‌లియాఖేరీ బ్లాక్‌లోని నివసించే సోనియా అనే 26 ఏళ్ల మహిళ 55వ వార్డు నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేసింది. ఎన్నికల్లో విజయం సాధించింది. దీంతో ఆమె బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్ అయ్యింది. అదే ఆఫీసులో అప్పటికే సోనియా భర్త సునీల్ కుమార్ స్వీపర్ గా పనిచేస్తున్నాడు. దీంతో భార్య బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్ అయితే భర్త అదే ఆఫీసులో స్వీపర్ గా పనిచేస్తున్నాడు.

కాగా యూపీలో బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్ ఎన్నిక‌లు జ‌ర‌గ్గా బ‌లియాఖేరి బ్లాక్ ఎస్సీ కేట‌గిరికి కేటాయించారు. దీంతో దళిత సామాజిక వర్గానికి చెందిన సోనియాను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది. సోనియా BAచదువుకుంది. దీంతో బీజేపీ ఎన్నికల్లో నిలబెట్టింది. ఈ ఎన్నిక‌ల్లో సోనియా సూనయాసంగా విజ‌యం సాధించింది. అప్పటికే బ‌లియాఖేరి బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫీసులోనే గ‌త కొంత‌కాలంగా సోనియా భ‌ర్త సునీల్ స్వీప‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. సోనియా బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్‌గా ఎన్నికైనా..త‌ను స్వీప‌ర్ ఉద్యోగాన్ని కొనసాగిస్తానని నాకు నామోషీ ఏమీ లేదని నా భార్యకు అంత ఉన్నతస్థాయికి చేరినందుకు ఆనందంగా ఉందని సునీల్ కుమార్ స్ప‌ష్టం చేశాడు.

భర్త అలా అంటే సోనియా కూడా తన భర్త గురించి గొప్పగా చెప్పింది. నా భర్త..నా కుటుంబం నన్ను ఎంతగా ప్రోత్సహించారని అందుకే ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాన‌ని తెలిపింది. తనకు ఈ అవకాశం కల్పించినందుకు ఈ బ్లాక్ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని తెలిపింది. ఇప్పటివరకూ నా భర్త ఇదే ఆఫీసులో స్వీపర్ గా ఉద్యోగం చేయ‌డం వ‌ల్లే కుటుంబాన్ని పోషించుకోగ‌లిగామని బ్లాక్ డెవ‌ల‌ప్‌మెంట్ చీఫ్ సోనియా తెలిపింది.