Khushbu Sundar: జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ నామినేట్

బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు తన అపాయింట్ మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన లేఖను ట్విట్టర్ లో ఖుష్బూ పోస్ట్ చేసి, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్ప బాధ్యతను తాను నిర్వర్తించగలనని తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలని అన్నారు.

Khushbu Sundar: జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూ నామినేట్

Khushbu Sundar

Khushbu Sundar: బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు తన అపాయింట్ మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన లేఖను ట్విట్టర్ లో ఖుష్బూ పోస్ట్ చేసి, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత గొప్ప బాధ్యతను తాను నిర్వర్తించగలనని తనపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలని అన్నారు.

ప్రధాని మోదీ పాలనలో మహిళా శక్తి వెలుగొందుతోందని, దాన్ని రక్షించేందుకు మరింత కృషి చేస్తానని చెప్పారు. ఎన్సీడబ్ల్యూ సభ్యురాలిగా సేవలు అందించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నారు. ఖష్బూకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నమలై సహా పలువురు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్సీడబ్ల్యూ సభ్యురాలిగా ఖష్బూను నామినేట్ చేయడం ఆమె మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తీరుకు గుర్తింపు అని అన్నారు. కాగా, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూతో పాటు మమతా కుమారి, డెలీనా ఖోంగ్ డప్ ను కూడా నామినేట్ చేశారు. 2010లో డీఎంకేలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖుష్బూ సుందర్… అనంతరం, 2014లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకీ 2020లో రాజీనామా చేసి, అప్పటి నుంచి బీజేపీలో కొనసాగుతున్నారు.

Shivmogga Airport: శివమొగ్గ ఎయిర్‭పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ