Mukhtar Abbas Naqvi : ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ? కేంద్రమంత్రి పదవికి రాజీనామా

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి పదవికి రాజీనామా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. త్వరలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి పదవిలో ఏదో ఒకటి ఇచ్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

Mukhtar Abbas Naqvi : ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ముక్తార్ అబ్బాస్ నఖ్వీ? కేంద్రమంత్రి పదవికి రాజీనామా

Mukhtar Abbas Naqvi

Mukhtar Abbas Naqvi : కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వం ముగియనుండటంతో ఆయన తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తోంది. రేపటితో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజ్యసభ పదవీకాలం పూర్తి కానుంది. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా, ఉభయసభల్లో ఆరు నెలల్లోపు సభ్యుడిగా లేకపోతే మంత్రిగా కొనసాగకూడదన్న నిబంధన మేరకు నఖ్వీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. త్వరలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్, లేదా ఉపరాష్ట్రపతి పదవిలో ఏదో ఒకటి ఇచ్చే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇక కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఆర్సీపీ సింగ్ రాజ్యసభ పదవీకాలం కూడా రేపటితో పూర్తి కానుంది. ఆర్సీపీ సింగ్ బీహార్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్సీపీ సింగ్ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు.

నఖ్వీ రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. అదే సమయంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ వ్యవహారాలపై ఆయనకు గట్టి పట్టు ఉంది.

Vice President election: ఉప రాష్ట్రప‌తి ఎన్నిక‌కు విప‌క్షాల నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని కాంగ్రెస్ య‌త్నాలు

రేపటితో నఖ్వీ రాజ్యసభ పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. పలు రాష్ట్రాల నుంచి అనేకమందికి మరోసారి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. అయితే, నఖ్వీకి మాత్రం మరో ఛాన్స్ ఇవ్వలేదు. ఇక జేడీయూ భాగస్వామిగా ఉన్న మరో కేంద్రమంత్రి ఆర్సీపీ సింగ్ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా పొడిగించలేదు.

రేపటితో ఆయన రాజ్యసభ సభ్యత్వం ముగియనుంది. దీంతో ఆయన కూడా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ లేదా ఉపరాష్ట్రపతి పదవిలో ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మైనార్టీ వర్గానికి చెందిన నేత కావడంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థి రేసులో నఖ్వీ పేరు పరిశీలనలో ఉంది. కాగా, ఇప్పటివరకు దీనిపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.