Uma Bharti: ‘మద్యం షాపుకు వెళ్లండి, ఆవు పాలు తాగండి’

Uma Bharti: కొంత కాలంగా సొంత పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద తీవ్ర యుద్ధం చేస్తోన్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి.. తాజాగా ఒక వింతైన సూచన చేశారు. ఓ మద్యం దుకాణానికి వెళ్లిన ఆమె, ఆ దుకాణం ముందు గోవును కట్టేసి పాలు తాగమంటూ మందుబాబులను కోరారు. నివారి జిల్లాలోని ఓర్చా పట్టణంలోని మద్యం దుకాణం ముందు జరిగిందీ ఘటన. మద్యం దుకాణం ముందు నిలబడి ‘‘షారబ్ నహీ, దూద్ పియో’’ (మద్యం కాదు పాలు తాగండి) అంటూ ఉమాభారతి నినాదాలు చేశారు.

Paddy Harvesting And Threshing : వరి కోతలు, నూర్పిడి సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు!

చాలా కాలంగా రాష్ట్రంలో మద్య నిషేధం చేయాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆమె మాటను పట్టించుకోకపోవడంతో అప్పుడప్పుడు కోపానికి గురై మద్యం దుకాణాలపైకి రాళ్లు విసరడం, పేడ విసరడం లాంటివి చేశారు. ఇవన్నీ జరిగిపోయాక, మద్యం షాపుల్ని ‘గోషాలలు’గా మారుస్తామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. తన డిమాండ్ నెరవేర్చడానికి జనవరి 31 వరకు ఆమె గడువు ఇచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ ప్రకటన చేశారు.

Akali-BSP: లోక్‭సభ ఎన్నికల్లోనూ అకాలీ-బీఎస్పీ కలిసే పోటి.. మాయావతిని కలిసి పొత్తును పొడగించిన సుఖ్బీర్

ఇందులో భాగంగానే తాజాగా మద్యం షాపు ముందుకు ఆవును తీసుకువచ్చి, పాలు తాగమంటూ మందుబాబుల్ని కోరారు. రాష్ట్రంలో మద్యాన్ని నిషేధించాలంటూ ఉమాభారతి గతంలో శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో ఉమాభారతి మండిపడ్డారు. మద్యాన్ని నిషేధించటమే కాదు రాష్ట్రంలో మద్యాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించడంపై ఉమాభారతి ఆగ్రహం వ్యక్తంచేస్తూ నేరుగా మద్యం షాపులోకి వెళ్లి రాయితో సీసాలను పగులగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Unstoppable 2: పవన్ పవర్ ఎపిసోడ్‌కు సూపర్ రెస్పాన్స్.. ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..!

రాష్ట్రవ్యాప్తంగా మద్యనిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ గతేడాది జనవరి 31 వరకు గడవువు విధించారు. విచిత్రంగా, ఆ గడువు పూర్తైన నాలుగు రోజులకే మద్యాన్ని మరింత అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కొత్త పాలసీని ప్రకటించింది. అనంతరం, కొన్ని నిరసనలు, దాడులు అంటూ ఆ యేడాది ముగిసింది. తాజాగా జనవరి 15 వరకు గడువు విధించారు. ఈసారి కూడా ప్రభుత్వం పట్టించుకున్న మానాన పోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ఉమాభారతి ఇలా స్వయంగా ఆమే రంగంలోకి దిగి మద్యం షాపుపైకి రాళ్లు విసిరారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతానని హెచ్చరించారు.

Nagpur MLC Election:ఆర్ఎస్ఎస్ హెడ్‭క్వార్టర్ పరిధిలో బీజేపీకి దారుణ ఎదురు దెబ్బ

ఉమాభారతి డిమాండ్ విషయాన్ని బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. పైగా శివరాజ్ సింగ్ ప్రభుత్వం మద్యంపై 10 నుంచి 13 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతోపాటు మద్యం ధరలను మరింత తగ్గించనున్నట్లు ప్రభత్వం తెలిపింది. దేశీయ, విదేశీ లిక్కర్‌ను విక్రయించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉన్న దానికంటే నాలుగు రెట్లు అదనంగా ఇంట్లో లిక్కర్‌ను నిల్వచేసుకునేందుకు కూడా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వార్షిక ఆదాయం కోటి రూపాలయకు మించి ఉంటే ఇంటి వద్దే షాప్ ప్రారంభించుకోవచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు