Black White Fungus : కరోనా కంటే ప్రమాదకరంగా మారిన ఫంగస్… మాస్కుల ద్వారా వ్యాప్తి

కరోనా నుంచి కోలుకున్నామన్న సంతోషం లేదు. అసలు కోవిడే సోకలేదన్న ఆనందం అంతకన్నా ఉండటం లేదు. కొత్తగా పడగవిప్పిన ఫంగస్ లు జనాలను జంకేలా చేస్తున్నాయి. కరోనా సోకి తగ్గిన వారిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుంటే, కరోనా సోకని వారినీ భయపెడుతోంది వైట్ ఫంగస్. ఇప్పుడు ఈ రెండు ఫంగస్ లు చాప కింద నీరులా దేశం అంతా విస్తరిస్తున్నాయి. కరోనా ఎంట్రీ ఇచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, కట్టడి చర్యలను పట్టించుకోకపోవడంతో అది విజృంభించింది. మరిప్పుడు సైలెంట్ గా చొచ్చుకొస్తున్న ఫంగస్ ను ఎలా తట్టుకోవాలి? దాని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Black White Fungus : కరోనా కంటే ప్రమాదకరంగా మారిన ఫంగస్… మాస్కుల ద్వారా వ్యాప్తి

Black White Fungus

Black White Fungus : కరోనా నుంచి కోలుకున్నామన్న సంతోషం లేదు. అసలు కోవిడే సోకలేదన్న ఆనందం అంతకన్నా ఉండటం లేదు. కొత్తగా పడగవిప్పిన ఫంగస్ లు జనాలను జంకేలా చేస్తున్నాయి. కరోనా సోకి తగ్గిన వారిపై బ్లాక్ ఫంగస్ అటాక్ చేస్తుంటే, కరోనా సోకని వారినీ భయపెడుతోంది వైట్ ఫంగస్. ఇప్పుడు ఈ రెండు ఫంగస్ లు చాప కింద నీరులా దేశం అంతా విస్తరిస్తున్నాయి. కరోనా ఎంట్రీ ఇచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా, కట్టడి చర్యలను పట్టించుకోకపోవడంతో అది విజృంభించింది. మరిప్పుడు సైలెంట్ గా చొచ్చుకొస్తున్న ఫంగస్ ను ఎలా తట్టుకోవాలి? దాని నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

భయపెడుతన్న బ్లాక్, వైట్ ఫంగస్ లు:
భారత్ పై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో బ్లాక్ ఫంగస్ బారినపడ్డ వారి సంఖ్య 9వేలకు చేరువైంది. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర బ్లాక్ ఫంగస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2వేలమందికి పైగా బ్లాక్ ఫంగస్ సోకగా, అందులో 90మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక గుజరాత్ లో 2వేల 281మంది బ్లాక్ ఫంగస్ బారిన పడ్డట్టుగా కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో 900లకు పైగా, తెలంగాణలో 500లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రత్తమైన కేంద్రం బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం ఆయా రాష్ట్రాల్లోని కేసుల ఆధారంగా మందులు కేటాయించింది. ఇటు వైట్ ఫంగస్ కేసులూ బయటపడటం కూడా ఆందోళన కలిగిస్తోంది.

బ్లాక్ ఫంగస్ రావడానికి కారణాలు:
బ్లాక్ ఫంగస్ ఎంట్రీతో దీనిపై అధ్యయనం ప్రారంభించారు నిపుణులు. దీని లక్షణాలు, కారణాలను వివరిస్తున్నారు. ఒకసారి వాడిన మాస్కులనే సరిగా శుభ్రం చేయకండా మళ్లీ మళ్లీ వాడటం… గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉండటం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన చాలామంది రోగులను పరిశీలించిన తర్వాత వీరు చాలాకాలం పాలు మాస్కులను ఉతక్కుండా, శుభ్రం చేయకుండా ధరించడం.. గాలి, వెలుతురు సరిగా లేని గదుల్లో ఉన్నవారే అని తేలిందని వైద్య నిపుణులు తేల్చారు. మరోవైపు విచ్చల విడిగా స్టెరాయిడ్స్ వాడకం వల్ల కూడా బ్లాక్ ఫంగస్ వచ్చేందుకు కారణంగా చెబుతున్నారు వైద్య నిపుణులు. వైద్యుల సూచన లేకుండానే స్టెరాయిడ్స్ వాడటం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయిన వారు అపరిశుభ్ర మాస్కులు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు గుర్తించారు.

బ్లాక్ ఫంగస్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
అంతేకాకుండా ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ లో వాడే కుళాయి నీళ్ల వల్ల ఊపిరితిత్తుల్లోకి ఈ ఫంగస్ చొరబడుతున్నట్టు తెలుసుకున్నారు. దీన్ని నివారించేందుకు తగిన సూచనలు చేస్తున్నారు. ప్రతి రోజూ మాస్కులను డిసినెఫ్ట్ చేసుకోవాలని.. గాలి, వెలుతురు సరిగా ఉన్న గదుల్లోనే ఉండాలని సూచిస్తున్నారు. అలాగే చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు ఉపయోగించే వారు తరుచుగా హ్యుమిడిఫైయర్లను శుభ్రం చేసుకోవాలని లేదా తరుచూ వాటిని మార్చుకోవాలని సూచిస్తున్నారు. స్టెరాయిడ్స్ తీసుకునే వారు క్రమం తప్పకుండా షుగర్ టెస్టులు చేయించుకోవాలని చెబుతున్నారు.

బ్లాక్ ఫంగస్ లక్షణాలు:
ఎక్కువగా ఆక్సిజన్ సపోర్టుతో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న కోవిడ్ పేషెంట్లను బ్లాక్ ఫంగస్ వేధిస్తోంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేని వారు, స్టెరాయిడ్స్ తీసుకుంటున్న పేషెంట్లు, కేన్సర్ చికిత్స తీసుకుంటున్న వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, దీర్ఘకాలం టోసిలిజుమాబ్ ఇంజక్షన్ తీసుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముక్కు నుంచి నల్లటి స్రావాలు కారడం, రక్తం కారడం, కంటి నొప్పి, తలనొప్పి, కంటి నొప్పి, కంటి చుట్టూ వాపు, కళ్లు ఎర్రబారడటం, కంటి చూపు తగ్గడం, కళ్లు తెరవడం మూయడంలో ఇబ్బందులు, ముఖం తిమ్మిరిగా మారటం, నోరు తెరవడం నమలడంలో సమస్యలు, దంతాలు వదులుగా అనిపించడం ఈ వ్యాధి లక్షణాలు.

ఎవరికి వారు తరుచుగా ముఖాన్ని పరీక్షించుకోవాలని ఎయిమ్స్ సూచించింది. ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ నివారణకు ఉపయోగిస్తున్న ఔషధాన్ని దేశవ్యాప్తంగా ఆరు కంపెనీలు తయారు చేస్తుండగా, తాజాగా మరో 5 కంపెనీలకు అనుమతి ఇచ్చింది కేంద్రం.

పొంచి ఉన్న మరో ముప్పు..వైట్ ఫంగస్:
ఇప్పటికే బ్లాక్ ఫంగస్ భయంతో జనమంతా భయాందోళన చెందుతుంటే, కొత్తగా వైట్ ఫంగస్ ఎంట్రీ ఇచ్చింది. బీహార్ లో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడటం భయాందోళనలు కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ ఫంగస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం అవుతుంటే, మరోపక్క వైట్ ఫంగస్ సవాల్ విసురుతోంది. ఇప్పటివరకు బీహార్ లోనే ఈ కేసులు బయటపడగా, కొద్దిరోజుల్లోనే మిగతా ప్రాంతాలకు విస్తరించే చాన్సుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాట్నాలో నలుగురు వైట్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నట్టు మైక్రోబయాలజీ డిపార్టుమెంట్ అధికారులు ప్రకటించారు. ఈ ఫంగస్ సోకిన వారికి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నట్టు గుర్తించారు.

బ్లాక్ ఫంగస్ కంటే ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉందన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి ఇది సోకే ప్రమాదం ఉందని, వైరస్ నుంచి బయటపడిన వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైట్ ఫంగస్ అత్యంత ప్రమాదకరం అంటున్నారు డాక్టర్లు. ఈ ఫంగస్.. కరోనా నుంచి కోలుకున్న వారిపై అటాక్ చేస్తుందని అంటున్నారు.. ఇది సోకిన వారిలో లంగ్స్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే గోళ్లు, చర్మం, ఉదర సంబంధ ఇబ్బందులతో పాటు నోరు, కిడ్నీ, బ్రెయిన్ పై ప్రభావం చూపుతుందని వివరిస్తున్నారు.