Nagpur : పెద్ద పేగుకు సోకిన బ్లాక్ ఫంగస్

మహారాష్ట్ర నాగ్ పూర్ లో 70 ఏళ వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఇతను తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో ఉన్న పెద్ద పేగులోని చివరి భాగంలో ఆరు అంగుళాల మేర బ్లాక్ ఫంగస్ ఉందని వైద్యులు గుర్తించారు.

Nagpur : పెద్ద పేగుకు సోకిన బ్లాక్ ఫంగస్

Mumbai

Black Fungus : ఓ వైపు కరోనా వైరస్, మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులు ప్రజలను కలవరపెడుతున్నాయి. కరోనా కేసులు కాస్తా తగ్గుముఖం పట్టినా…బ్లాక్ ఫంగస్ కేసులు అక్కడక్కడ వెలుగు చూస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధిని మానవ శరీరంలోని కళ్లలో, మెదడులో ఇప్పటి వరకు గుర్తించారు. అయితే…శరీరంలోని పెద్ద పేగులో బ్లాక్ ఫంగస్ వైరస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర నాగ్ పూర్ లో 70 ఏళ వృద్ధుడు నివాసం ఉంటున్నాడు. ఇతను తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు.

Read More : Tokyo Olympics 2020: దేశానికే తొలి గోల్డ్ మెడల్.. సాధించిన డఫీ

వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శరీరంలో ఉన్న పెద్ద పేగులోని చివరి భాగంలో ఆరు అంగుళాల మేర బ్లాక్ ఫంగస్ ఉందని వైద్యులు గుర్తించారు. వ్యాధి కారణంగా కంటి చూపు కూడా పోయింది. ప్రస్తుతం ఇతను సెవెన్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దేశంలో మొదట బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించారు. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వైట్‌‌, ఎల్లో ఫంగస్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే వాటి సంఖ్య చాలా తక్కువ. కొత్తగా గ్రీన్ ఫంగస్ వెలుగు చూసిన సంగతి తెలిసిందే.