Black Fungus : బ్లాక్ ఫంగస్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణమిదే..

అరుదైన వ్యాధిగా పరిగణించే బ్లాక్ ఫంగస్ దేశంలో చెలరేగిపోవడానికి కారణం ఇండస్ట్రియల్ ఆక్సిజనేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకుండా పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన్ ను వైద్య సేవల్లో ఉపయోగించడం వల్ల ఫంగస్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు వైద్యులు.

Black Fungus : బ్లాక్ ఫంగస్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణమిదే..

Black Fungus Causes

Black Fungus Causes : అరుదైన వ్యాధిగా పరిగణించే బ్లాక్ ఫంగస్ దేశంలో చెలరేగిపోవడానికి కారణం ఇండస్ట్రియల్ ఆక్సిజనేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో జాగ్రత్తలు తీసుకోకుండా పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన్ ను వైద్య సేవల్లో ఉపయోగించడం వల్ల ఫంగస్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంటున్నారు వైద్యులు.

మెడికల్ ఆక్సిజన్ తో పోలిస్తే పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన్ లోని స్వచ్చతపాలు ఎక్కువ. అయితే, మెడికల్ ఆక్సిజన్ ను నిల్వ చేయడం, రవాణ చేయడంలో ప్రత్యేకమైన ప్రొటోకాల్ ను పాటిస్తారని వైద్యులు చెబుతున్నారు. కానీ, పరిశ్రమల్లో ఉపయోగించే ఆక్సిజన్ ను నిల్వ చేసినప్పుడు అందులోకి దుమ్ము కణాలు చేరుకోవడం, లీకులు ఉండటం, అక్కడక్కడ నీటిలో కలిసి కలుషితం అవడం సాధారణంగా జరిగేది అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.

దీంతో దుమ్ము కణాలతో నిండిన ఆక్సిజన్ ని కోవిడ్ రోగులకు అందివ్వడం వల్ల దుమ్ము కలుషిత నీరుతో పాటు ఊపిరితిత్తుల్లోకి చేరిన సూక్ష్మ క్రిములు బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ కు దారి తీస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు షుగర్ అదుపులో లేకపోవడం, ఇక కోవిడ్ చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ వాడటంతో పాటు ఆక్సిజన్ అందించేటప్పుడు ఫ్లో మీటర్ లో ఉపయోగించే నీరు కారణంగా బ్లాక్ ఫంగస్ సోకుతున్నట్టుగా వైద్యులు భావించారు. కానీ, తాజాగా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ కూడా బ్లాక్ ఫంగస్ విజృంభణకు కారణం కావొచ్చంటున్నారు.

బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడానికి స్టెరాయిడ్స్, మధుమేహానికి మించి ఇతరత్రా కారణాలున్నట్లు కూడా నిపుణులు చెబుతున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన రోగుల్లో 100% మంది యాంటీబయాటిక్స్‌ తీసుకున్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు. రోగులకు సూచించిన మందుల్లో అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్, కార్బాపెనెమ్స్‌ లాంటివి కనిపించాయని, అందువల్ల ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ పెరగడానికి యాంటీ బయాటిక్సే కారణంగా కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు.