Black Fungus : షుగర్ నియంత్రణలో ఉంచుకుంటే..ఫంగస్ దరిచేరదు!

మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే..షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే...బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Black Fungus : షుగర్ నియంత్రణలో ఉంచుకుంటే..ఫంగస్ దరిచేరదు!

Sugar

Sugar Under Control : ఓ వైపు కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే..మరోవైపు బ్లాక్ ఫంగస్ కలవరపెడుతోంది. ఈ ఫంగస్ తో పలువురు మృతి చెందుతున్నారని వార్తలు వెలువడుతుండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రధానంగా మధుమేహ వ్యాధిగ్రస్థులు ఆందోళన చెందుతున్నారు. మధుమేహం నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడుతున్న వారిలో తీవ్ర భయం రేకేత్తుతోంది. అయితే..షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే…బ్లాక్ ఫంగస్ గురించి భయపడాల్సిన అవసరమే లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

షుగర్ చెకింగ్ కు గ్లూకో మీటర్ : –
అయితే..షుగర్ చెక్ చేసుకోవడానికి గ్లూకోమీటర్ తప్పనిసరి. దీంతో ఈ మీటర్ తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ ఉదయం పరగడుపున షుగర్ చేసుకోవాలంటున్నారు. అప్పుడు షుగర్‌ లెవెల్‌ 125 కంటే తక్కువగా ఉండాలి. టిఫిన్‌ చేసిన అనంతరం గంటన్నర తర్వాత మరోసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు 250 కంటే తక్కువగా ఉండాలంటున్నారు. వీలైతే ఒకసారి ల్యాబ్‌కు వెళ్లి హెచ్‌బీ ఏ1సీ (మూడు మాసాల సగటు) చూపించుకోవాలని.. గరిష్టంగా 7.2 కంటే తక్కువగా ఉంటే ఇబ్బంది లేదని చెబుతున్నారు.

ఏం తినాలి : –
షుగర్ ను కంట్రోల్ ఉంచుకోవాలంటే..ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని, పలు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జొన్న, కొర్రలు, రాగులు, అండుకొర్రలతో చేసిన ఆహారం, బీరకాయ, సోరకాయ, గోరు చిక్కుడు, చిక్కుడు కాయల్లో పీచు ఎక్కువగా ఉంటుందని, వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల.షుగర్స్ లెవల్స్ పెరగవని అంటున్నారు. అలాగే..పైనాపిల్ నిమ్మ, జామపండ్లు తీసుకోవాలంటున్నారు. వీటిల్లో వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. బియ్యంతో చేసిన ఇడ్లీలు, దోశలు, అన్నం, పఫ్‌లు, బంగాళ దుంప వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఇన్సులిన్ : –
కరోనా సోకిన తర్వాత స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది…దీంతో షుగర్ ఎక్కవవుతుందని, మందులతో నియంత్రణలోకి రాదని వైద్యులు వెల్లడిస్తున్నారు. షుగర్‌ నియంత్రణలోకి వచ్చేవరకూ ఇన్సులిన్‌ వాడుకోవచ్చని, నియంత్రణలోకి వచ్చాక ఇన్సులిన్‌ ఆపేసి తిరిగి మందులు వాడొచ్చని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి బ్లాక్ ఫంగస్ కు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు మరోసారి చెబుతున్నారు.

Read More : DRDO :కోవిడ్ కు విరుగుడు, డీఆర్‌డీవో 2డీజీ కరోనా మందు