Black Money : స్విస్‌ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల బ్లాక్‌ మనీ | Black money of Indians in Swiss banks has increased tremendously

Black Money : స్విస్‌ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల బ్లాక్‌ మనీ

మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్‌ బ్యాంక్‌ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ 2021లో 30,500 కోట్లకు చేరినట్టు స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Black Money : స్విస్‌ బ్యాంకుల్లో భారీగా పెరిగిన భారతీయుల బ్లాక్‌ మనీ

Black money : స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల బ్లాక్‌మనీ భారీగా పెరిగింది. నల్లధనాన్ని స్వదేశానికి తెస్తానన్న ప్రధాని మాట అటుంచితే… అదే స్విస్‌ బ్యాంకుల్లో మన వాళ్ల నల్లధనం ఒక్క ఏడాదే 50శాతం పెరిగింది. ప్రస్తుతం స్విస్‌ బ్యాంకుల్లో భారతీయులు దాచిన డబ్బు… 30వేల కోట్ల రూపాయలకు పైమాటేనని లెక్కతేలింది. స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ గణాంకాలతో ఈ విషయం రుజువైంది.

స్విస్‌ బ్యాంక్‌ వెల్లడించిన లెక్కలు చూసి భారతదేశమే కాదు.. యావత్‌ ప్రపంచమే అవాక్కయింది. స్విస్‌బ్యాంకుల్లోకి మన వాళ్ల సొమ్ము గతంలో కంటే వేగంగా తరలిపోతున్నది. మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్‌ బ్యాంక్‌ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ 2021లో 30,500 కోట్లకు చేరినట్టు స్విట్జర్లాండ్‌ కేంద్ర బ్యాంక్‌ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మొత్తం 14 ఏండ్ల గరిష్టం.

Switzerland : స్విస్ బ్యాంకు నుంచి భారతీయుల జాబితా వచ్చేసింది!

స్విట్జర్లాండ్‌ బ్యాంక్‌లు ఎస్‌ఎన్‌బీకి అందించిన అధికారిక గణాంకాల ప్రకారం మాత్రమే 30వేల 500 కోట్ల సొమ్ము భారతీయుల ఖాతాల్లో ఉంది. కానీ ఆ దేశంలో భారతీయులు భారీగా పోగేసిన నల్లధనంపై వివరాలు కాదు. థర్డ్‌ కంట్రీ సంస్థల పేర్లతో భారతీయులు, ఎన్నారైలు, ఇతరులకు ఉన్న సొమ్ము ఈ డాటాలో వెల్లడి కాలేదు.

×