Tamil Nadu : తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బుధవారం విరుధునగర్ జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో నలుగురు మృతి చెందారు.

Tamil Nadu : తమిళనాడులో భారీ పేలుడు.. నలుగురు మృతి

Tamil Nadu Sivakasi

Tamil Nadu : తమిళనాడులోని బాణాసంచా కర్మాగారాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. శనివారం విరుధునగర్ జిల్లా శివకాశిలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనను మరువకముందే.. బుధవారం మరో ఘటన చోటుచేసుకుంది. ఇదే జిల్లాలో పటాకులు ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కకడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో నలుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదు.

చదవండి : Sivakasi : న్యూ ఇయర్ వేళ విషాదం.. శివకాశిలో పేలుడు.. నలుగురు మృతి

పటాకులు తయారీ కంపెనీల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతుండటం కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. సరైన రక్షణ లేకుండా పటాకులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ ప్రాణాలు విడుస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో పటాకులు కర్మాగారాల్లో పేలుడు జరిగి 50 మందికిపైగా మృతి చెందారు. తరచుగా ప్రమాదాలు జరుగుతుండటంతో గతంలో అధికారులు తనిఖీలు చేపట్టి సరైన భద్రత చర్యలు పాటించని 60 కర్మాగారాలను సీజ్ చేశారు. ఇక దేశ బాణాసంచా రాజధానిగా పేరు పొందిన శివకాశిలో ప్రజలకు పటాకులు తయారీనే జీవనాదారం. వారు నిత్యం పటాకులు తయారు చేస్తూనే ఉంటారు. ఇక్కడ తయారైన పటాకులు దేశ విదేశాలకు సరఫరా అవుతాయి.

చదవండి : Sivakasi : న్యూ ఇయర్ వేళ విషాదం.. శివకాశిలో పేలుడు.. నలుగురు మృతి