మగ ఉద్యోగులకు 730 పెయిడ్‌ లీవులు : గుడ్ న్యూస్ చెప్పిన బీఎంసీ

మగ ఉద్యోగులకు 730 పెయిడ్‌ లీవులు : గుడ్ న్యూస్ చెప్పిన బీఎంసీ

Bmc Paid Leave For Male Employees

BMC paid leave for male employees : సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసే మహిళలకు మెటర్నటీ లీవులు ఉంటాయి. పురుషులకైతే అటువంటి అవకాశం ఉండదు. కానీ బృహన్‌ ముంబైన్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)మాత్రం పురుష ఉద్యోగులకు ఈ విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి పురుష ఉద్యోగులకు పెయిడ్‌ లీవులు ఇవ్వాలని నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్ మహాసభలో దీనికి సంబంధించి ప్రతిపాదన పెట్టగా..బీఎంసీ సభ్యుల ఆమోదం పలికారు. దీంతో పురుష ఉద్యోగులు తమ పిల్లల బాగోలు చూసుకోవటానికి లీవులను ఇవ్వనుంది. అదికూడా పెయిడ్ లీవులు కావటం విశేషం.

వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వారిని తీసుకెళ్లేందుకు కొందరి ఇళ్లల్లో తల్లులుగానీ, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరు ఉండని పరిస్థితి ఉంటుంది. అటువంటివారికి బీఎంసీ ఇవ్వనున్న ఈ సౌకర్యం చాలా ఉపయోగకరంగా ఉండనుంది. అంగవైకల్య పిల్లల బాగోగులు చూసుకోవటానికి..లేదా తల్లులు చూసుకోవటానికి వీలు లేని పిల్లలను చూసుకోవటానికి పెయిడ్ లీవులు ఇవ్వనుంది. బెస్ట్‌ సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజులు పేయిడ్‌ లీవులు ఇవ్వాలనే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదం లభించింది. మొదటి ఇద్దరు పిల్లలకు, వారికి 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇది వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది.

దీంతో ఇంటివద్ద తమ వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవలన్నా, ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని..బీఎంసీ ఇవ్వనున్న ఈ ప్రత్యేక సెలవులైన 730 రోజుల్లోంచి వాడుకోవచ్చని మేయర్‌ కిశోరీ పేడ్నేకర్‌ తెలిపారు. వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు వారిని తీసుకెళ్లేందుకు కొందరి ఇళ్లల్లో తల్లులుగానీ, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరు ఉండని పరిస్థితి ఉండవచ్చు. అటువంటి సమయాల్లో పురుష ఉద్యోగులు సెలవు పెట్టి ఇంటి వద్ద ఉండటం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం లాంటివి చేయాల్సి ఉండే పరిస్థితి.

ఈ ఇబ్బందుల్ని గుర్తించి బీఎంసీ తమ ఉద్యోగులు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పదవీ విరమణ పొందే వరకు లేదా దివ్యాంగ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఈ 730 సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు అధ్యక్షుడు ప్రవీణ్‌షిండే తెలిపారు. ఈ లీవ్‌లను పొందాలంటే దరఖాస్తుతో పాటు 40 శాతం వికలాంగుడిగా ఉన్నట్లు సర్టిఫికెట్‌ను జోడించాల్సి ఉంటుంది. వికలాంగ పిల్లలు తనపై ఆధారపడి ఉన్నట్లు సర్టిఫికెట్‌ జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు ప్రవీణ్‌షిండే.