Motivation worker : జోరువానలో కూడా డ్యూటీ చేస్తున్న పారిశుద్ధ కార్మికురాలు..హ్యాట్సాఫ్ అమ్మా ప్రశంసలు

Motivation worker : జోరువానలో కూడా డ్యూటీ చేస్తున్న పారిశుద్ధ కార్మికురాలు..హ్యాట్సాఫ్ అమ్మా ప్రశంసలు

Bmc Women Worker

Work commitment Sanitation worker : చేసే పనిమీద శ్రద్ధ అంతకి భావం ఉంటే మండుటెండ అయినా..జోరు వాన అయినా ఒక్కటే. మనకు అన్నం పెట్టే పనిమీద అటువంటి అంకిత భావం కలిగిన ఓ మహిళ జోరున వర్షం కురుస్తున్నా తన పని మానలేదు. తౌటే తుఫాను ప్రభావంతో ముంటైలో కురిసిన భారీ వర్షాలకు..భారీ వేగంతో వీచిన గాలలకు ముంబై నగరం వణికిపోయింది. భారీగా వర్షాలు కురిసాయి. భారీ వృక్షాలు నేల కూలాయి.

అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. మరోవైపు కరోనా భయంతో జనం ఇంటికి పరిమితమయ్యారు. పరిస్థితి ఇంత భయానకంగా ఉన్న క్రమంలో కూడా నగరంలోని ఓ మునిసిపల్ వర్కర్ మాత్రం తన డ్యూటీ మానలేదు. వర్షం వచ్చింది..జోరుగా కురుస్తునే ఉంది..పని మానేసి ఇంటికిపోదాం అనిమాత్రం అనుకోలేదామె.తన విధి నిర్వహణలో రాజీ పడలేదు. వర్షం జోరున కురుస్తున్నా రోడ్లు ఊడుస్తూనే ఉంది. తన పనిలో నిమగ్నమైపోయింది. జోరు వానలో కూడా రోడ్లు ఊడుస్తున్నా ఆ పారిశుద్ధ్య కార్మికురాలి ఫోటోలు..వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వర్షం నుంచి రక్షించేందుకు రెయిన్ కోట్ లేకున్నా, తలకు ప్లాస్టిక్ కవరు చుట్టుకుని ఆమె రోడ్డు ఊడ్చడంలో నిమగ్నమైంది. ఆమె నిబద్ధతను చూసి పలువురు కొనియాడుతున్నారు. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. ‘‘ఈ రోజుకు ఇంతకుమించిన మోటివేషన్ లేదని’’ అన్నారు. బీఎంసీ వారికి రెయిన్ కోట్‌లు అందివ్వాలని సూచించారు. వీరు కోవిడ్ వారియర్ల కంటే తక్కువమే కాదని మరికొందరు ప్రశంసించారు. వర్షాకాలం వస్తుండడంతో వారికి రెయిన్ కోట్లు ఇవ్వాలని చాలామంది నెటిజన్లు బీఎంసీకి సూచించారు. ఈ వీడియోను మీరూ చూడండి.