Haryana Board exams : పరీక్షలకు చదువుకోవటానికి విద్యార్ధుల్ని తెల్లవారుజామున లేపాలని ఆలయాలు, మసీదులను కోరిన హర్యానా ప్రభుత్వం

త్వరలో బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి..విద్యార్ధులు పొద్దు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే దేవాలయాలను,మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది.

Haryana Board exams : పరీక్షలకు చదువుకోవటానికి విద్యార్ధుల్ని తెల్లవారుజామున లేపాలని ఆలయాలు, మసీదులను కోరిన హర్యానా ప్రభుత్వం

Haryana Govt  wake up alarm for students by temples and mosques

Haryana Board exams: బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి..విద్యార్ధులు పొద్దు పొద్దున్నే లేచి చదువుకోవాలంటే దేవాలయాలను,మసీదులు లౌడ్ స్పీకర్ల ద్వారా నిద్రలేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది. దేవాలయాలు (సుప్రభాతాలు), మసీదుల్లో (ఆజాన్) పొద్దు పొద్దున్నే అంటే ఉదయం 4.30, 5గంటలకు లౌడ్ స్పీకర్లు వినిపిస్తుంటాయి. ఆలయాలు, మసీదుల్లో మైకుల ద్వారా పిల్లలను (విద్యార్ధులను) లేపాలి అంటూ హర్యానా ప్రభుత్వం కోరింది. ప్రభుత్వానికి ఇంత ఇంట్రస్ట్ ఏమిటంటే ఈ ఏడాది విద్యార్ధుల ఉత్తీర్ణత శాతం పెంచాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఇటువంటి వింత విన్నపాలు చేస్తోంది హర్యానా విద్యాశాఖ.

బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న క్రమంలో 10, 12 క్లాస్ విద్యార్థులు చక్కగా పొద్దు పొద్దునే లేచి చదువుకోవాలని హర్యానా ప్రభుత్వం అసలు ఉద్ధేశ్యం. ఉదయం పూట ప్రశాంతంగా ఉంటుంది. చదివిన పాఠాలు చక్కగా గుర్తు ఉంటాయి. అందుకే ప్రభుత్వానికి ఈ పాట్లు. ఆలయాలు, మసీదులు, గురుద్వారాలల్లో మైకులను తెల్లవారుజామునే నిద్రలేపేలా చేయాలని కోరింది. మైకుల ద్వారా వారిని తెల్లవారుజామునే నిద్రలేపాలని కోరింది.

పిల్లలను 4.30 గంటలకు నిద్రలేపి పరీక్షలకు సన్నద్ధం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యాశాఖ కోరింది. అంతేకాదు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి జాయింట్ ప్లాన్ రూపొందించుకోవాలని, సెల్ఫ్ స్టడీ కోసం ప్రత్యేకంగా కొన్ని గంటలు కేటాయించేలా చూడాలని అన్ని ప్రభుత్వ పాఠశాలు, కాలేజీ (ఇంటర్) ప్రిన్సిపాళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

తెల్లవారుజామునే లేచి చదువుకుంటే చక్కగా గుర్తు ఉంటుందని దాంతో విద్యార్దులు పరీక్షలు బాగా రాయగలుగుతారని విద్యాశాఖ భావించి ఇటువంటి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెల్లవారుఝాము మసయంలో మనసు ప్రశాంతంగా ఉంటుందని, వాహనాల శబ్దాలు కూడా ఉండవని కాబట్టి విద్యార్థులను తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేపేలా తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ దిశగా విద్యార్ధుల తల్లిదండ్రులకు ఆయా ఉపాధ్యాయులు తెలియజేయాలని కూడా తెలిపింది.

విద్యార్ధుల ఉదయం 5.15 గంటలకు లేచి చదువుకునేలా చూడాలని కోరింది. పిల్లలు లేచారా? లేదా? అన్న విషయాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకోవాలని సూచించింది. దానికి విద్యార్ధుల తల్లిదండ్రులు సహకరించాలని కూడా ఆదేశించింది. అలా చేయకుంటే స్కూలు మేనేజ్‌మెంట్ కమిటీ దృష్టికి తీసుకు రావాలని కూడా స్పష్టంచేసింది. అంతేనా ఈ బాధ్యతను ఆయా పంచాయితీ సిబ్బందికి కూడా కొన్ని సూచనలు చేసింది. తెల్లవారుజామున వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలని పంచాయతీలను ఆదేశించింది. దీంతో బోర్డు ఎగ్జామ్స్ మాటేమో గానీ ఇదెక్కడి కొత్త రూల్ రా బాబు అనుకుంటున్నారు ఉపాధ్యాయులు, పంచాయితీ కార్యాలయాల సిబ్బంది.

లౌడ్ స్పీకర్ల ద్వారా ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు,పంచాయితీ కార్యాలయాలు తెల్లవారుజామునే ఎనౌన్స్‌మెంట్లు చేయాలని..ఆ సమయంలో లేచి చదువుకుంటే ప్రతి విద్యార్థికి అదనంగా రెండుమూడు గంటల సమయం దక్కుతుందని సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అన్షాజ్ సింగ్ ప్రభుత్వ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, జిల్లా విద్యాశాఖ అధికారులకు డిసెంబర్ 22న జారీ చేసిన ఆదేశాల్లో తెలిపారు. పరీక్షలకు ఇంకా 70 రోజుల సమయమే ఉందని..ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరగటానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించింది హర్యానా విద్యాశాఖ.