Viral Wedding ‌: వరద ముంచినా..పెళ్లితో ఒక్కటై..నావలో నవజంట విహారం

పక్క కరోనా..మరోపక్క ముంచెత్తిన వరద. పెళ్లి ఎలా చేసుకోవాలో తెలీక ప్రేమ జంట ఆందోళ. కానీ బాగా డబ్బులుండీ, చక్కటి వాతావరణం ఉండీ,అన్నీ సమకూరితే పెళ్లి ఎవ్వడైనా ఘనంగా చేసుకుంటాడు. కానీ కరోనా కాలంలో ముంచెత్తిన వరదలో పెళ్లి వాయిదా వేసుకుండా పెళ్లితో ఒక్కటైనవారే అసలైన నవజంట అన్నట్లుగా వినూత్నంగా ఆలోచించి వరదలో నావలో విహారం చేసిన నవ వధూవరులు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

Viral Wedding ‌: వరద ముంచినా..పెళ్లితో ఒక్కటై..నావలో నవజంట విహారం

Maharashtra Viral Wedding (1)

Viral Wedding In Flood water : ఓ పక్క కరోనా..మరోపక్క ముంచెత్తిన వరద. పెళ్లి ఎలా చేసుకోవాలో తెలీక ప్రేమ జంట ఆందోళ. కానీ బాగా డబ్బులుండీ, చక్కటి వాతావరణం ఉండీ,అన్నీ సమకూరితే పెళ్లి ఎవ్వడైనా ఘనంగా చేసుకుంటాడు. కానీ కరోనా కాలంలో ముంచెత్తిన వరదలో పెళ్లి వాయిదా వేసుకుండా పెళ్లితో ఒక్కటైనవారే అసలైన నవజంట అన్నట్లుగా వినూత్నంగా ఆలోచించి వరదలో నావలో విహారం చేశారు మహారాష్ట్రకు చెందిన నవ వధూవరులు.

వర్షం వచ్చినప్పుడు మిరపకాయ బజ్జీలు ఏ వెధవైనా తింటాడు..కానీ వర్షంలో ఐస్ క్రీమ్ తినేవాడే మగాడు అని ఓ సినిమాలో డైలాగ్. భలేఉంది కదూ..ఇదిగో వరద ముంచెత్తి ఊరంతా వరద నీరు ఉప్పొంగినా వినూత్నంగా ఆలోచించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమికుల జంట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వధూవరులు బోట్లలో వెళ్తున్న వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.

మహారాష్ట్రలో వరుడు రోహిత్ సూర్య కు సోనాలికి జూలై 23న నిశ్చితార్థం జరిగింది. 26న వివాహం పెట్టుకున్నారు. అయితే పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. అదే సయమంలో వారి ఉండే ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. అయినా సరే పెళ్లి వాయిదా వేయటానికి ఆ ప్రేమ జంటకు ఇష్టంలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా మీరు ఎలా అంటే అలాగే అన్నారు. వరద నీటిలో బోటుల్లో అత్యంత ఆత్మీయుల్ని బంధువులను పెళ్లి కూతురు ఇంటికి తరలించారు. మిగతా పనులనూ చక్కబెట్టారు.

ఈ విషయంపై పెళ్లి కొడుకు రోహిత్‌ సూర్య వంశీ మాట్లాడుతూ.. ‘‘పెళ్లి వేడుక కోసం ఇంటి దగ్గర ఓ ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేశాం. కానీ వర్షం వల్ల ప్లేస్ మార్చాల్సి వచ్చింది. అతి కొద్దిమంది అతిథులతో సోనాలి ఇంట్లో వివాహం చేసుకోవాలని అనుకున్నాం.ఓ పడవను ఏర్పాటు చేసి కోవిడ్‌కు నిబంధనలను పాటిస్తూ బంధువుల్ని సోనాలి ఇంటికి చేర్చాం.తరువాతు వధువుని వరుడే స్వయంగా బోటులో తీసుకొచ్చాడు.అలా వధూ వరులు పడవలో ఊరేగుతున్నట్లుగా వరద నీటిలో పడవలో షికారు చేస్తూ ఇంటికొచ్చి పెళ్లి చేసుకున్నారు. పడవలోంచి వధువుని వరుడు రోహిత్ ఎత్తుకుని తీసుకొచ్చి మరీ వివాహం చేసుకున్నాడు. వరద నీటిలో వధూవరుల జంట షికారు చేస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.