Cremation using Petrol: నదీ ఒడ్డుకొచ్చిన శవాలను ఆచూకీ లేకుండా చేయాలనుకున్న పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా నదీ ప్రవాహంలో మృతదేహాలు కొట్టుకువస్తుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇదే కాకుండా సోషల్ మీడియాలో

Cremation using Petrol: నదీ ఒడ్డుకొచ్చిన శవాలను ఆచూకీ లేకుండా చేయాలనుకున్న పోలీసులు

Cremation

Cremation using Petrol: రాష్ట్ర వ్యాప్తంగా నదీ ప్రవాహంలో మృతదేహాలు కొట్టుకువస్తుండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇదే కాకుండా సోషల్ మీడియాలో బలియాఘాట్ ప్రాంతంలో మృతదేహాలను దహనం చేస్తున్న వీడియో వివాదాస్పదంగా మారడంతో పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు.

ఆ వీడియోలో ఒక వ్యక్తి.. నదీ ఒడ్డున మృతదేహాలను పేర్చి వాటిపై పెట్రోల్ పోశాడు. వాటిపై టైర్లు ఉంచి నిప్పంటించారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులెవరూ పాట్రోలింగ్ చేస్తున్న సమయంలో నదిలో పారేయకుండా చూసుకోవాలని చెప్పారు. పరిసరాలు పాడవడంతో పాటు ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందిన పోలీసులకు ముందే చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ నదీ ప్రవాహంలో శవాలు వేయడానికి వీల్లేదని సీఎం నుంచి ఆర్డర్ వచ్చింది.

పోలీసులేమో నదీ ఒడ్డున మృతదేహాలను టైర్లు, పెట్రోల్ తో కాలుస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన బలియా పోలీసు అధికారులు ఐదుగురిని సస్పెండ్ చేశారు. అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

అందిన సమాచారం ప్రకారం.. రెండ్రోజుల క్రితం రెండు శవాలు నదీ ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. పోలీసులు ఇన్ఫర్మేషన్ అందుకుని వాటిని కనిపించకుండా చేయాలనుకున్నారు. పెట్రోల్, టైర్లు కాల్చి ముగించేయాలనుకున్నారు.

అంత్యక్రియలు గౌరవప్రదంగా జరగాలని వాటి కోసం అవసరమైతే ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఎవరిదైనా అనాథ శవం ఉంటే వారి మతాలకు అనుగుణంగా అంత్యక్రియలు పూర్తి చేయాలని ఆదేశించారు.