Oxygen Cylinder : హ్యాట్సాఫ్ ఫ్రెండ్… కరోనా సోకిన స్నేహితుడి కోసం.. ఆక్సిజన్ సిలిండర్‌తో 1400 కిమీ ప్రయాణం

తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి చాలా రిస్క్ చేశాడు. అతడు చూపిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి తన స్నేహితుడు ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న ఆ వ్యక్తి.. ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు. రూ.10వేలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ కొన్నాడు. సిలిండర్ ను కారులో పెట్టాడు.

Oxygen Cylinder : హ్యాట్సాఫ్ ఫ్రెండ్… కరోనా సోకిన స్నేహితుడి కోసం.. ఆక్సిజన్ సిలిండర్‌తో 1400 కిమీ ప్రయాణం

Oxygen Cylinder

Oxygen Cylinder : తన స్నేహితుడి కోసం ఓ వ్యక్తి చాలా రిస్క్ చేశాడు. అతడు చూపిన తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. నిజమైన స్నేహితుడు అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు. కరోనా బారిన పడి శ్వాస తీసుకోవడానికి తన స్నేహితుడు ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకున్న ఆ వ్యక్తి.. ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు. రూ.10వేలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ కొన్నాడు. సిలిండర్ ను కారులో పెట్టాడు. ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్నేహితుడి దగ్గరికి చేరుకున్నాడు. అతడికి ఆక్సిజన్ సిలిండర్ అమర్చి ప్రాణాలు నిలిపాడు. ఈ ఘటన యూపీలో జరిగింది.



ఆ వ్యక్తి పేరు దేవేంద్ర(38). టీచర్ గా పని చేస్తాడు. జార్ఖండ్ లోని బొకారోలో నివాసం ఉంటాడు. దేవేంద్ర స్నేహితుడు రంజన్ అగర్వాల్ ఢిల్లీలోని ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా, రంజన్ అగర్వాల్ కరోనా బారిన పడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని నోయిడాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, రంజన్ అగర్వాల్ దేహంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. నోయిడాలో ఆక్సిజన్ కొరత ఉంది. దీంతో ఆసుపత్రి సిబ్బంది.. రంజన్ అగర్వాల్ కుటుంబసభ్యులకు విషయం చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయాలన్నారు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన రంజన్ అగర్వాల్ కుటుంబసభ్యులకు.. అప్పుడు.. రంజన్ స్నేహితుడు దేవేంద్ర గుర్తుకు వచ్చాడు. వెంటనే దేవేంద్రకు ఫోన్ చేసి విషయం చెప్పారు.



తన మిత్రుడు ప్రాణాపాయంలో ఉన్నాడని తెలుసుకున్న దేవేంద్ర ఏ మాత్రం ఆలస్యం చెయ్యలేదు. ఎలాగైనా తన స్నేహితుడి ప్రాణం నిలపాలని నిర్ణయించుకున్నాడు. అంతే… ఆ వెంటనే జార్ఖండ్ లోని ఆక్సిజన్ ప్లాంట్ కి వెళ్లాడు. అక్కడ రూ.10వేలు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ కొన్నాడు. దాన్ని తన కారులో పెట్టుకున్నాడు. అలా ఆ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పయనం అయ్యాడు. ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. చివరికి నోయిడా చేరుకున్నాడు. తన స్నేహితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆక్సిజన్ సిలిండర్ అందించాడు. అలా తన ఫ్రెండ్ ని కాపాడుకున్నాడు. మిత్రుడి కోసం దేవేంద్ర చేసిన రిస్క్ ని అంతా ప్రశంసిస్తున్నారు. నిజమైన ఫ్రెండ్ అంటే నీలా ఉండాలని అంటున్నారు. దేవేంద్ర లాంటి ఫ్రెండ్ ఉన్న రంజన్ అగర్వాల్ నిజంగా అదృష్టవంతుడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.